
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
సోంపేట: మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన రైతు పీతాంబరం ఈశ్వరరావు(45) విద్యుత్ షాక్‌తో బుధవారం సాయంత్రం మృతి చెందాడు. బారువ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఈశ్వరరావుకు వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ. దీనిలో భాగంగానే బుధవారం సాయంత్రం ఎప్పటిలాగే తన విద్యుత్ మోటారు ఆన్ చేయడానికి వెళ్లగా విద్యుత్ షాక్ కొట్టడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ బి.మంగరాజు, విద్యుత్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని బలగ కూడలి వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఒక ఆటో డ్రైవర్ దాడికి పాల్పడినట్లు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు బుధవారం తెలియజేశారు. బలగకు చెందిన చిట్టి రాజు ఆర్టీసీలో ఒప్పంద ఉద్యోగిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి బుధవారం బత్తిలి వెళ్లేందుకు బస్సు తీశాడు. సరిగ్గా బలగ – రిమ్స్ కూడలికి వచ్చేసరికి వెనుకగా వస్తున్న ఒక ఆటో డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపు చేయలేక బస్సును ఢీకొట్టాడు. ఆటో నుంచి తక్షణమే దిగిన డ్రైవర్ ఎండపల్లి వసంతరావు బస్సు సడన్‌గా బ్రేక్ వేయడం వలనే ఢీకొన్నానని అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి దిగాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
రైలు ఢీకొని 37 గొర్రెలు మృతి
కంచిలి: మండలంలోని కంచిలి – సోంపేట మార్గం మధ్య రైల్వేట్రాక్‌ను దాటుతుండగా బుధవారం ఉదయం రైలు ఢీకొని 37 గొర్రెలు మృతి చెందాయి. మేతకు వెళ్తున్న క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా అనుకోకుండా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. మృతి చెందిన గొర్రెలు బొగాబెణి పంచాయతీ పరిధి జెన్నాగాయి కాలనీకి చెందిన ఇప్పిలి చిన్నారావుకు చెందినవిగా గ్రామస్తులు చెబుతున్నారు. రైలు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందడంతో చిన్నారావు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తమకు ఏర్పడిన ఈ నష్టంపై ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో తపాల వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి ఈ నెల 22న తపాల అదాలత్ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు బుధవారం తెలిపారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను ‘తపాల అదాలత్‘ పేరిట ‘సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్, శ్రీకాకుళం – 532001’ చిరునామాకు పంపాలని కోరారు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కాలేజ్ సమీపంలోని సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వ్యక్తిగతంగా సమర్పించి అదాలత్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.

విద్యుత్ షాక్‌తో రైతు మృతి