
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయిన పిరియా విజయ, ఆమె భర్త సాయిరాజ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా విజయ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌లు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు తెలిపారు. – కంచిలి
రామకృష్ణకు స్టెవీ అవార్డు
జలుమూరు: మండలంలోని యలమంచిలి గ్రామానికి చెందిన మెండ రామకృష్ణకు అత్యున్నత స్టెవీ అవార్డు వరించింది. అమెరికా దేశం న్యూయార్క్‌లో రామకృష్ణకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ స్వాఫ్ట్‌వేర్ కంపెనీలు, సేవారంగ సంస్థలు, అంతర్జాతీయ వ్యాపార రంగ దిగ్గజాలు, కస్టమర్ సర్వీసు కేంద్రాలు, టెక్నాలజీ సంస్థలు, మార్కెటింగ్ నిపుణులు తదితర రంగాల్లో విభిన్న ప్రతిభ చూపినవారికి సుమారు 200 మంది వరకు జడ్జీలు నిర్ణయించి అవార్డుకు ఎంపిక చేస్తారు. రామకృష్ణ టెక్నాలజీ రంగంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు వచ్చినట్లు తెలిపారు. ఆయన గత 20 ఏళ్లుగా అమెరికాలో వివిధ హోదాలో పనిచేశారు. ఆయనకు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పద్మప్రియ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీపీ గోపి తదితరులు అభినందనలు తెలిపారు.