
దాడులే దళితులకు నజరానా
బాబును గద్దె దించడమే దళితుల లక్ష్యం
వైఎస్ జగన్ గెలుపుకోసం సైనికుల్లా
పనిచేద్దాం: వైఎస్సార్‌సీపీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టి.జె.ఆర్.సుధాకర్‌బాబు
వైఎస్సార్ సీపీ పాలనలోనే దళితులకు సంపూర్ణ న్యాయం:
మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్
దళితులను ఎమ్మెల్సీ చేసేందుకు కృషి: మాజీ మంత్రి ధర్మాన
ఆధునిక అంబేడ్కర్ జగన్: మాజీ మంత్రి సీదిరి
దోపిడీకి స్వస్తి చెప్పాలి: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
వైఎస్సార్‌సీపీ దళిత విభాగం విస్తృత స్థాయి సమావేశానికి భారీగా హజరు
తాత్కాలిక ప్రలోభాలకు లోనుకాకుండా దళితుల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడికే పట్టం కట్టాలి. దళితులకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదు. దళిత కులానికి చెందిన నారాయణస్వామిని డిప్యూటీ సీఎంగా చేసిన ఘనత జగనన్నది. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారు.
– ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎం,
పార్టీ జిల్లా అధ్యక్షుడు
ఆధునిక యుగంలో అంబేడ్కర్ ఆలోచనలు అమలుచేసిన పార్టీ వైఎస్సార్‌సీపీయే. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అందులో 12 ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2500 కోట్లు ఖర్చుచేయడం అవసరమా? అదేదో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు చేస్తే బాగుంటుంది కదా. దీనిపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. ప్రశ్నించకుంటే మనందరినీ అమ్మేస్తాడు. మన సొత్తుని మనమే కాపాడుకోవాలి. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరారు.– డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
చంద్రబాబు బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక దళితుల్ని విస్మరించారన్న విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాలి. విభజించి పాలించడం చంద్రబాబుకి వెన్నతోపెట్టిన విద్య. దళితులకు ఏ కష్టం ఉన్నా నిరంతరం మీ వెంటే ఉండే పార్టీ వైఎస్సార్ సీపీ.
–గొర్లె కిరణ్‌కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే
దళితుల వెంటే ఉంటామని వేదికలపై చెప్పడం కాదు. గుండెల్లో పెట్టుకుని ప్రతిక్షణం ఆలోచన చేసి సంక్షేమ పథకాలు అందించే నాయకుడు కావాలి. కూటమి ప్రభుత్వంలో దళితుల్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో సైతం ప్రాధాన్యత కల్పించకపోవడం అన్యాయం.
– రెడ్డి శాంతి, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో దళితులున్నప్పటికీ ఎమ్మెల్యే సీటును గెలిపించుకునేంత సంఖ్యా బలం లేకపోవడం వల్లే ఎమ్మెల్యే సీటు దక్క డం లేదు. ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించేందుకు కృషి చేస్తా. రాష్ట్రంలో టీడీపీ పాలనే సాగుతోంది తప్ప కూటమి పాలన కాదు. బీజేపీ, జనసేనల్ని గెలుపుకోసం వాడుకున్నారు. అమరావతిలో వరదకు పడవలు వేస్తే వాటిని మీడియాలో ప్రచారం కాకుండా ఆంక్షలు పెట్టడం దారుణం. దళితులపై అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలు చుట్టూ తిప్పించుకుని మళ్లీ ఓట్లు వేయించాలని చూస్తున్నారు.
– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):
దళితులకు పూర్తిస్థాయిలో సంక్షేమ ఫలాలు అందించిన నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని, దళిత కులానికి చెందిన ఏ ఒక్కరిని తట్టినా అంబేడ్కర్, జగన్‌మోహన్‌రెడ్డిల పేరే వినిపించాలని వైఎస్సార్ సీపీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టి.జె.ఆర్.సుధాకర్‌బాబు అన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు, అరాచకాలు, ఆకృత్యాలు, వేధింపులు చేస్తునే ఉంటారని, అటువంటి వ్యక్తిని గద్దె దించేవరకు యావత్తు దళిత జాతి నిద్రపోకూడదని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ దళిత విభాగం విస్తృత స్థాయి సమావేశం ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముందు గా అంబేడ్కర్, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
●ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి మాట్లాడుతూ దళితులను నా చెల్లి.. నా అక్క .. నా అన్న అని అక్కున చేర్చుకున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. కూటమి పాలన వచ్చాక రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేసి దళితుల్ని పట్టిపీడిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క దళితుడిపైనా దాడులు జరగడంగానీ, వేధింపులు గానీ లేవన్నారు. దళితులంతా ఏకమై కూటమి నేతల మెడలు వంచాలని పిలుపునిచ్చారు.
●వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి మాట్లాడుతూ దళితుల కోసం నిరంతరం ఆలోచన చేసే మొదటి వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అయితే రెండో వ్యక్తి ధర్మాన ప్రసాదరావు అని అన్నారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య, కొరపాన కళ్యాణి అనే ఉద్యోగినులపై మంత్రి అచ్చెన్న, కూన రవికుమార్‌ల వేధింపులను దళి త జాతి మరిచిపోదన్నారు. కేంద్రమంత్రి రామ్మో హన్‌నాయుడు ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామన్నారు.
●వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.కనకారావు మాట్లాడుతూ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమ
దేశ చరిత్రలో ఎవ్వరు చేయలేని పథకాలను అమలు చేసిన సుపరిపాలన అందించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. అటువంటి వైఎస్సార్‌సీపీని అనవసరంగా వదులుకున్నామని ఎంతోమంది నిరుపేదలు బాధపడుతున్నారు. రైతుకు ఎరువు, విత్తనాలు, పురుగుమందులు ఇవేవీ సమయానికి దొరకడం లేదు. దొరికినా వ్యయప్రయాసలకు ఓర్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. రేషన్ ఇంటివద్దకే వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దళిత జాతి మొత్తం జగన్‌కు అండగా నిలవాలి.
– తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్
మనిషిగా పుట్టాలనుకునేవాడెవ్వడైనా దళితుడుగా పుడతాడా అన్న చంద్రబాబులాంటి నీచుడు రాష్ట్రంలో సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యం. ఉచిత బస్సు పథకం, పింఛన్ పెంపు వంటి పథకాల వల్ల దళితులకు ఏ మాత్రం ఉపయోగం లేదు. దళితుల కోసం రూ.50వేల కోట్లు ఖర్చుచేసింది జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేసింది బడుగు, బలహీనవర్గాల కోసమేనన్న సంగతి మనమంతా గుర్తుంచుకోవాలి. కేంద్ర, రాష్ట్ర మంత్రులున్న శ్రీకాకుళం జిల్లాలో దళితుల కోసం ఒక్క మంచి కార్యక్రమమైనా చేశారా? కేంద్ర మంత్రి ఢిల్లీలో, రాష్ట్ర మంత్రి అచ్చెన్న అమరావతిలో ఉంటారు. అదే వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంటే అర్ధరాత్రి సైతం ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, అప్పలరాజు, సీతారాంలు అందుబాటులో ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయి. 2029 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే మనందరి లక్ష్యం. – టి.జె.ఆర్.సుధాకర్‌బాబు, వైఎస్సార్ సీపీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
లుచేయకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేయడం దారుణమన్నారు. దళితుల క్షేమం కోసం పరితపించే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపుకోసం కృషి చేయాలన్నారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షుడు జైహింద్‌కుమార్, విశాఖపట్నం అధ్యక్షుడు శివరామకృష్ణ, శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు యజ్జల గురుమూర్తి, నాయకులు కల్లేపల్లి లక్ష్మణరావు, జీవన్, జడ్యాడ జయరావ్, వావిలాపల్లి శ్రీనివాసరావు, అలికాన మాధవరావు, నేతల కృష్ణ, కల్లేపల్లి రాంగోపాల్, గుజ్జల యోగేశ్వరరావు, బుడారి లక్ష్మణరావు, పెయ్యిల లక్ష్మణరావు, చల్ల దేవరాజు, లాయర్ శ్యా మ్, సతివాడ రామినాయుడు, కుర్మాన బాలకృష్ణ,
వైఎస్సార్‌సీపీ హయాంలో విద్య, వైద్యం, సంక్షేమ పథకాలతో దళితులకు ఎంతగానో లబ్ధి చేకూరింది. కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యమిస్తారు. – చింతాడ రవికుమార్, వైఎస్సార్‌సీపీ
ఆమదావలస సమన్వయకర్త
ఆట్ల సరోజనమ్మ, టొంపల సీతారాం, యడ్ల ఈశ్వరరావు, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు ముఖ్య నాయుకులు ఎం.వి పద్మావతి, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్, మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, దుంపల లక్ష్మణరావు, అంబటి శ్రీనివాసరావు, ఎం.వి.స్వరూప్, గొండు రఘురాం, చింతాడ రామ్మోహన్‌రావు, గద్దిబోయిన కృష్ణయాదవ్, రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

దాడులే దళితులకు నజరానా

దాడులే దళితులకు నజరానా

దాడులే దళితులకు నజరానా

దాడులే దళితులకు నజరానా

దాడులే దళితులకు నజరానా

దాడులే దళితులకు నజరానా