
ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
నరసన్నపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకంతో నష్టపోతున్న తమను ఆదుకోవాలని ఆటో, క్యాబ్ మ్యాక్సీ డ్రైవర్లు కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలో బుధవారం నిరసన చేపట్టారు. డ్రైవర్ల ప్రతినిధి కాల్ల నరసింహం మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం వలన తమ ఆదాయం బాగా పడిపోయిందని, కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, నరసన్నపేటలో అన్ని స్టాండ్లకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతినివ్వకపోవడంతో స్టాండ్‌ల వద్దే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో ఆటో, క్యాబ్ మాక్సీ డ్రైవర్ల సంఘం ప్రతినిధులు డి.ఉమ, యు.శ్రీనివాసరావు, జి.వెంకటేష్, డి.రమేష్, కె.చిరంజీవి, కర్రి డిల్లీశ్వరరావు, పి.రాంబాబు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.