
మంచం పట్టిన చింతలగార
టెక్కలి రూరల్: మండలంలోని చింతలగార గ్రామంలో గత కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభి స్తున్నాయి. గ్రామంలో సుమారు 30 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. అందువల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని చెబుతున్నారు. గ్రామవాసులు టెక్కలి ప్రభుత్వాస్పత్రితో పాటు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
రోగులతో కిటకిట
టెక్కలి: ప్రస్తుతం వ్యాధులు ముసురుతున్న నేపథ్యంలో టెక్కలి జిల్లా ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మరో వైపు గ్రామాల్లో సరైన ఫీవర్ సర్వే లు లేకపోవడంతో ప్రతి ఇంట్లో జ్వర పీడితులు అవస్థలు పడుతున్నారు. టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం రోజుకు 500 కు పైగా ఓపీ నమోదు కాగా వాటిలో సగానికి పైగా జ్వర పీడితులు ఉండడం గమనార్హం. జ్వరాల బారిన పడినవారిలో అధిక సంఖ్యలో పీడితులు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు.