వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు
నరసన్నపేట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని మంగళవారం పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చా రు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు వైఎస్సార్‌కు రుణపడి ఉంటారని కృష్ణదాస్ అన్నారు. ఆయన విగ్రహాల వద్ద నివాళులర్పించాలని సూచించారు.
వానలపై యంత్రాంగం అప్రమత్తం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో దీని ప్రభావం కారణంగా జిల్లాలో సోమ వారం నుంచి విస్తారంగా వర్షాలు మొదల య్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండా లని ఆదేశించారు. కాలువలు, చెరువులను పర్యవేక్షించాలని సూచించారు. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మరింత జగత్తగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.
వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్
శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో జిల్లాలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. సో మవారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1, 2 మోస్తరు నుంచి భారీ వర్షాలు, సెప్టెంబర్ 3, 4 తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సెప్టెంబర్ 5 అల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం ఉత్తరాంధ్ర తీర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
‘జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు’
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 2025 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు జిల్లాలో వరి, ఇత ర పంటలు కలిపి 3,73,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు జరిగిందని ఆయన వివరించారు. ఈ సాగుకు గాను మొదటి, రెండో విడతలలో కలిపి 20,481 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైందని అన్నారు. అయితే రైతుసేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 11,443 మె ట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 12,393 మెట్రిక్ టన్నులు కలిపి, మొత్తం 23,836 మెట్రి క్ టన్నుల యూరియా ఇప్పటివరకు రైతులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ వివరించారు. అదనంగా స్పీక్ కంపెనీ ద్వారా శ్రీకాకుళం రోడ్డు రైలు హెడ్ వద్దకు 589 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతున్నాయని చెప్పారు.

వైఎస్సార్ వర్ధంతిలో భాగస్వాములు కండి