నిరంకుశం | - | Sakshi
Sakshi News home page

నిరంకుశం

Sep 2 2025 8:15 AM | Updated on Sep 2 2025 8:15 AM

నిరంక

నిరంకుశం

● ఎరువు అడిగితే దరువు!

నిజం చెబితే నిర్బంధం.. నినాదం వినిపిస్తే నిరంకుశత్వం.. హామీలు గుర్తు చేస్తే ఆంక్షలు.. కూటమి ప్రభుత్వపు తీరు ఇది. గుండెలు అవిసేలా అన్నదాతలు ఎరువుల కోసం అడుగుతుంటే సర్కారు చెవికెక్కడం లేదు. ఎండనక, వాననక గంటల తరబడి క్యూలో రైతులు నిలబడుతుంటే ప్రభుత్వం కంటికి కనిపించడం లేదు. ఆఖరికి రైతు సమస్యపై వినతి పత్రం ఇస్తామన్నా.. తీసుకోవడానికి కూడా పాలకులకు మనస్కరించడం లేదు. ఎరువుల కొరతపై సోమవారం రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకులు చేపట్టిన ఆందోళనను ప్రభుత్వం ఖాకీల సాయంతో అణచివేయాలనుకుంది.

అన్నదాతపై

సర్కారు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరించింది. రైతుల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులను నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంది. హౌస్‌ అరెస్టులు, ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అరెస్టులు చేసి పోలీసు స్టేషన్ల కు తరలిస్తూ ప్రశ్నించే హక్కును కాలరాసింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్‌సీపీ రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మొద్దునిద్ర లో ఉన్న ప్రభుత్వం దిగి రావాలని, యూరియాతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అన్ని రకాలుగా విఫలమైన వ్యవసా య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

మడపాంలో దాసన్నకు అడ్డగింత

మడపాం టోల్‌గేట్‌ దగ్గర పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో పాటు వస్తున్న నరసన్నపేట నియోజకవర్గ కేడర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రైతుల పక్షాన నిలబడటానికి స్వేచ్ఛ లేదా అంటూ ధర్మాన కృష్ణదాస్‌ గట్టిగా అడగడంతో ఆయన వెహికల్‌ మాత్రమే వదిలారు. మిగతా వారికి ఆంక్షలతో అడ్డుకట్ట వేశారు.

రోడ్డుపై కిరణ్‌ బైఠాయింపు

రణస్థలంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు నియోజకవర్గ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళంలో జరిగే నిరసన కార్య క్రమానికి వెళ్లవద్దని ఆంక్షలు విధించారు. రైతుల సమస్యలపై నిరసన చేస్తుంటే అడ్డుకోవడమేంటని గొర్లె కిరణ్‌కుమార్‌ ప్రతిఘటించినా పోలీసులు వదల్లేదు. దీంతో రహదారిపైనే కేడర్‌తో కలిసి బైఠాయించారు.

ఆమదాలవలసలో ఉద్రిక్తత..

నిరసన కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను తన కార్యాలయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అక్కడ కూడా అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుకెళ్లేందుకు యత్నించిన రవికుమార్‌ను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల తీరును తప్పు పట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని పొందూరు, ఆమదాలవలస, సరుబుజ్జిలి తదితర మండలాల నుంచి శ్రీకాకుళంలోకి నిరసన కోసం వచ్చే వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. వేరే పనుల కోసం వస్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు.

శ్రీకాకుళమంతా ఆంక్షలే..

వైఎస్సార్‌సీపీ చేపట్టిన రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం జరగకుండా శ్రీకాకుళం నగరమంతా పోలీసులు ఆంక్షలు విధించారు. 80 అడుగుల రో డ్డు ఎంట్రన్స్‌ దగ్గర, వాంబే కాలనీ దగ్గర, పొన్నాడ బ్రిడ్జికి వెళ్లే రోడ్‌, సెవెన్‌ రోడ్‌ జంక్షన్‌, జెడ్పీ దగ్గర, సంతోషిమాత గుడి, కంపోస్టు కాలనీ ఏరియా వద్ద పోలీసులు దిగ్బంధం చేశారు. ఎవరినీ రానివ్వలే దు. దీంతో సాధారణ జనాలు కూడా ఇబ్బందులు పడ్డారు. రైతుల సమస్య కోసం నిరసన చేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రజలు వాపోయిన పరిస్థితులు కనిపించాయి. జ్యోతిరావుపూలే విగ్ర హం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను తీసేసి, అక్క డున్న వారందరినీ స్టేషన్‌కు తరలించేశారు. గేదెల పురుషోత్తం, చిట్టి జనార్ధన్‌, మార్పు పృథ్వీతో మరికొంతమందిని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. మిల్లు జంక్షన్‌ దగ్గర ముంజేటి కృష్ణ మూర్తి, బాలకృష్ణ, పీస గోపి, పీసీ శ్రీహరి, జిల్లా పరిషత్‌ దగ్గర నినాదాలు చేశారని అంధవరపు సూరిబాబు, కరిమి రాజేశ్వరరావు, బొడ్డేపల్లి పద్మజ, జయదేవ్‌, కణితి కృష్ణారావును అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు రా ష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూ ప్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతి, ఎంపీపీ గొండు రఘును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ నాయకులు వెనక్కి తగ్గలేదు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతు సమస్యలపై అధికారులకు వినతి పత్రం ఇచ్చే వెళ్లారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ను కలిసిన వారిలో పార్లమెంట్‌ పరిశీలకులు కుంభా రవిబాబు, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, తూర్పు కాపు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్‌, పోలినాటి వెలమ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్సీ విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, యువ నాయకుడు ధర్మాన రామ్‌ మనోహర్‌ నాయుడు, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, జిల్లా గ్రీవెన్స్‌ విభాగం అధ్యక్షుడు రౌతు శంకరరావు, వైఎస్సార్‌సీపీ నాయకురాలు కామేశ్వరి, యువజన విభాగం సంయుక్త కార్యదర్శి నక్క రామరాజు, అల్లు లక్ష్మీనారాయణ, చిట్టి రవి, గద్దిబోయిన కృష్ణయాదవ్‌, వెంకటరమణి, ప్రసాద్‌, పీస గోపి, పీస శ్రీహరి తదితరులు ఉన్నారు.

అన్నదాతల సమస్యలపై

నినదించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై

ఆంక్షలు

నిరసన చేపట్టకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు, అరెస్టులు

రోడ్లపై బైఠాయించిన రైతులు,

వైఎస్సార్‌సీపీ నాయకులు

పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు

ఇబ్బందులు పెట్టినా ఎరువు సమస్యలపై అధికారులకు నేతల విన్నపం

నిరంకుశం 1
1/4

నిరంకుశం

నిరంకుశం 2
2/4

నిరంకుశం

నిరంకుశం 3
3/4

నిరంకుశం

నిరంకుశం 4
4/4

నిరంకుశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement