
ఏపీకి పెట్టుబడులు అంత ఈజీ కాదు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆంధప్రదేశ్‌కు పెట్టుబడులు రావడం అంత సులువు కాదని, అమరావతికి స్థల దోషం ఉన్నట్లు ఉందని, పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం తనకై తే లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానాల్లో వెళ్లి ప్రత్యేక గదుల్లో ఉన్నా దానివల్ల ఉపయోగం లేదన్నారు. చంద్రబాబు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడని, ఏపీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడనుకున్నా.. చంద్రబాబు అంత బలాదూర్ ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరని దేశమంతా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని చేత ఒక్క మాట చెప్పించలేకపోయిన అసమర్థుడు చంద్రబాబు అని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ఏపీలో 35 వేల ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించగా.. కూటమి ప్రభుత్వం ఆ సంఖ్యను పది వేలకు కుదించాలని ఆలోచన చేస్తోందన్నారు. ఇప్పటికే 3 లక్షల మంది నిరుపేద విద్యార్థులు బడులకు దూరమయ్యారన్నారు. బీహార్ విషయంపై ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సీఐఎస్‌ఎఫ్ ఫోర్స్ పార్లమెంట్‌లోకి వెళ్లడం దారుణమని మోహన్ అన్నారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పుడు నెహ్రూ, ప్రకాశం పంతులకు తిరుపతిని రాజధాని చేయమని చెప్పిన గొప్ప నాయకుడు సర్ధార్ గౌతు లచ్చన్న అని మోహన్ కొనియాడారు. రాజధాని అమరావతిని కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ప్రజలెవ్వరు స్వాగతించడం లేదన్నారు.
కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్