
టీచర్లకు గుదిబండగా బోధనేతర పనులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ కార్యక్రమాలు ఉపాధ్యాయులకు గుదిబండగా మారకూడదని, టీచర్ల సమస్యలు సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఫ్యాప్టో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నిర్వహించిన ధర్నా శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఫ్యాప్టో జిల్మా చైర్మన్ బమ్మిడి శ్రీరామ్‌మూర్తి అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ జూన్‌లో బదిలీలు జరిగితే ఉపాధ్యాయులకు నేటికీ జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. యాప్‌లు రద్దు చేస్తామని చెప్పి ఒకే యాప్‌లో అనేక కార్యక్రమాలు, ఫొటోలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించడంతో బోధనకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు. ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికగా ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ పడాల ప్రతాప్‌కుమార్ ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్, సీనియర్ నాయకులు టెంక చలపతిరావు, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో కో చైర్మన్‌లు వాల్తేటి సత్యనారాయణ, హరి ప్రసన్న, ఎస్టీయూ అధ్యక్షుడు ఎస్.వి.రమణ, ఉపాధ్యాయ ఉద్యమాల సీనియర్ నాయకులు బొడ్డేపల్లి మోహన్‌రావు, బీటీఏ అధ్యక్షుడు రమేష్‌బాబు, ఆప్టా సీనియర్ నాయకులు రామారావు, యూటీఎఫ్ సీనియర్ నాయకుడు గొంటి గిరిధర్, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలివాడ ధనంజయరావు, ఏపీ ఎస్సీ ఎస్టీ యూఎస్ రాష్ట్ర కార్యదర్శి బోనెల రమేష్, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమణ తదితరులు పాల్గొన్నారు.
తక్షణమే సమస్యలు పరిష్కరించాలి
ఫ్యాప్టో ధర్నాలో సంఘ నాయకులు