
అనుమానాస్పదంగా విశ్రాంత మహిళా ఉద్యోగి మృతి
చికిత్స పొందుతూ మృతి
నరసన్నపేట: మండలంలోని గోపాలపెంటలో వ్యవసాయ కూలీ బమ్మిడి రాజారావు(50) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతో మూడు రోజుల క్రితం పొలాలకు వినియోగించే కలుపు మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతి చెందాడు. భార్య బమ్మిడి సరస్వతి ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.
నరసన్నపేట: స్థానిక శ్రీనివాసనగర్–5లో అద్దె ఇంట్లో నివాసముంటున్న ఆర్.సూర్యకాంతం(62) అనుమానాస్పదంగా మృతి చెందారు. గత మూడు రోజులుగా ఇంటి డోర్ తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వాళ్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆమె పెంపుడు కుమార్తె జ్యోత్స్న ఆదివారం రాత్రి వచ్చి పరిశీలించగా సూర్యకాంతం మంచంపై మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్ ఇంటిని సోమవారం పరిశీలించి కేసు నమోదు చేసి, పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా సూర్యకాంతం మండలంలోని మాకివలస పీహెచ్‌సీలో సీహెచ్‌వోగా పనిచేస్తూ జూన్ నెలాఖరులో ఉద్యోగ విరమణ పొందారు. ఆమె ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. కుమార్తె జ్యోత్స్నకు వివాహమవ్వగా రాయగడలో ఉంటున్నారు. ఈ దశలో ఆమె మృతి చెందారు. ఆమె పెంపుడు కుమార్తె జ్యోత్స్న మాట్లాడుతూ రెండు రోజుల క్రితం తనతో అమ్మ మాట్లాడి ఒంట్లో బాగులేదని చెప్పారన్నారు. అయితే ఆ తర్వాత ఆమె నుంచి ఫోన్ రాకపోవడం, తాము చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి ఓనర్‌కు పరిశీలించమన్నామన్నారు. ఇంటి తలుపులు లోపల నుంచి వేసి ఉన్నాయని చెప్పారన్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని చెప్పడంతో ఆదివారం రాత్రి వచ్చి పరిశీలించగా మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

అనుమానాస్పదంగా విశ్రాంత మహిళా ఉద్యోగి మృతి