
శ్రీముఖలింగంలో శివ స్వాముల సందడి
జలుమూరు: శ్రావణ మాసం సోమవారం ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో శివస్వాములు మధుకేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి వారు తెచ్చిన తేనె, పానకాలు, ఇరుముడులు స్వామికి సమర్పించి గోలెం మొక్కులు తీర్చారు. ప్రతి ఏడాది స్వామివారికి దీక్షతో మొక్కులు తీర్చి ఇరుముడి సమర్పించడం శివ భక్తులు ఆచారం అని భక్తులు తెలిపారు.
అలాగే పర్లాఖిముండి, కాట్రగడ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.