
పాలకులకు గుణపాఠాలు చెప్పాలని..
శ్రీకాకుళం న్యూకాలనీ: పాలకులకు గుణ‘పాఠాలు’ చెప్పేందుకు గురువులు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ లోకానికి ఇచ్చిన హామీలపై అతీగతీ లేకపోవడంతో సర్కారు చెవులకు వినిపించేలా గర్జించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించి, పాఠాలు చెప్పేందుకు అవకాశం ఇ వ్వాలని కోరుతూ శనివారం ఆందోళన చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. సర్కారు వైఖరిపై గురువులంతా గుర్రుగా ఉన్నారు. తమ డి మాండ్లను ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నా అటు ప్రభుత్వంలో గానీ, ఇటు ఉన్నతాధికారుల్లో గానీ చలనం లేదు. కనీసం సీఎంగాని, చీఫ్ సెక్రటరీ గానీ సమావేశం నిర్వహించడం లేదని, ఒక ప్రకటన కూడా చేయడం లేదని వాపోతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలవడం కూడా కష్టంగా మారిపోయిందని అంటున్నారు. ఇలాంటి తరుణంలో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉద్యమ బాటకు శ్రీకారం చుడుతున్నారు.
నేడు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా..
అటు విద్యాశాఖలో ఉపాధ్యాయులకు పాఠాల బోధనకు ఎదురవుతున్న సమస్య లు, ఇటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఆర్థిక పరమైన డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 2వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఽఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో సైతం ధ ర్నాను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఫ్యా ప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 ప్రధానమైన డిమాండ్ల సాధనకు శనివారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ జన రల్ పడాల ప్రతాప్‌కుమార్, కో చైర్మన్లు పూజారి హరిప్రసన్న, వాల్తేటి సత్యనారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్‌వీ రమణమూర్తి, మజ్జి మదన్‌మోహన్, బి.వెంకటేశ్వర్లు, కోశాధికారి కె.జగన్‌మోహన్‌రావు, కార్యవర్గ సభ్యులు ఎల్.బాబూరావు, పి.కృష్ణారావు, వై.వాసుదేవరావు, జి.రమణ, ఎస్‌వీ అనీల్‌కుమార్, బి.రవి, ఎస్‌ఏఎల్‌వీ పూర్ణిమ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ్యాప్టో ప్రధాన డిమాండ్లలో కొన్ని..
● ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమా లు లేకుండా చేయాలి. పీ–4 వంటి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు.
● నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.
● ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి.
● అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలి.
● 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి.
● 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని తక్షణమే ప్రకటించాలి. మూడు పెండింగ్ డీఏలను ప్రకటించాలి. డీఏ బకాయిలను, 11వ పీఆర్పీ బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
● సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
బోధనలో ఎదురవుతున్న సమస్యలు, ఆర్థిక పరమైన అంశాల సాధనపై నేడు పోరుబాట
బోధనేతర బాధ్యతలపై గుర్రుగా ఉన్న గురువులు
సీపీఎస్ రద్దు, కారుణ్య నియామకాలు ఇతరత్రా డిమాండ్ల సాధనే ధ్యేయంగా ధర్నా
కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టేందుకు ఏర్పాట్లు