
2478 మంది ఉంటే.. 800 మందికే రేషన్
సారవకోట: మండలంలో వృద్ధులు, దివ్యాంగుల ఇచ్చే రేషన్ సరుకులు 800 మందికి మా త్రమే అందజేశారు. జూలై నెల 25 నుంచి 31లోగా వృద్ధులు, దివ్యాంగుల ఇంటికెళ్లి రేషన్ సరుకులు అందజేయాలి. మండలంలో 2478 మంది వృద్ధులు, దివ్యాంగులు ఉండగా.. 800 మందికి మాత్రమే అందజేశారు. సంబంధిత అధికారులు రేషన్ డీలర్లకు దీనిపై సరైన ఆదేశాలు అందించకపోవడం వల్లనే కొందరు రేషన్‌కు దూరమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా జైలు ఆకస్మిక తనిఖీ
గార: అంపోలు జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.హరిబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ముద్దాయిలకు అందించే ఆహార పదార్థాలను రుచి చూశారు. గ్రంథాలయం, మహిళా బ్యారక్‌లు పరిశీలించి ముద్దాయిలతో మాట్లాడారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జైలర్ దివాకర్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో నాగుపాము
నరసన్నపేట: మండలంలోని బడ్డవానిపేట అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం నాగు పా ము భయోత్పాతం సృష్టించింది. 10 అడుగులకు పైగా పొడవున్న పామును సెంటర్‌లో ఒక్కసారిగా చూసిన అంగన్‌వాడీ వర్కర్ పి.వనజాక్షి ఆందోళనకు గురైంది. స్థానికులు వెంటనే స్పందించి పామును పట్టుకుని బయటకు వదిలారు. అంగన్‌వాడీ వర్కర్ వనజాక్షి మా ట్లాడుతూ ఉదయం 9 గంటల సమయంలో కేంద్రాన్ని తెరిచానని, నలుగురు పిల్లలను బయట కూర్చోబెట్టి తలుపులు తెరిచి వంట చేసేందుకు అట్ట పెట్టె తెరవగా పాము కనిపించిందని, స్థానికులను పిలిస్తే వారు వచ్చి పట్టుకుని బయటకు పంపారని తెలిపారు.
జిల్లా డైమండ్ జూబ్లీ వేడుకలకు శ్రీకారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు జరిగే డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని జిల్లా రెవెన్యూ అధి కారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వి విధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చే సిన సమీక్ష సమావేశంలో ఆయన మా ట్లాడారు. జిల్లా పురోగతిని ప్రతిబింబించేలా ప్రతి కార్యక్రమాన్ని రూపొందించాలని, ప్ర జలంతా పాల్గొనాలనిపించేలా ఉత్సవాలు ఉండాలని ఆయన అన్నారు.
● ఆగస్టు 13న ఉదయం 10 గంటలకు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో వేడుకలు ప్రారంభం.
● 1950 నుంచి 2025 వరకు జిల్లాలో అభివృద్ధిని ఆవిష్కరించే సాంస్కృతిక ప్రదర్శనలు.
● సాయంత్రం 4 నుంచి 7.30 వరకు ఆర్ట్స్ కాలేజీ రోడ్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు శోభాయాత్ర. ఆదివాసీ తెగల జానపద నృత్యాలు, సంగీతం, వారసత్వ కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణ.
● రాత్రి 6 నుంచి 10 వరకు ఫుడ్ స్టాల్స్. స్థానిక రుచులు, తెగల మిల్లెట్ ఫుడ్, తీరప్రాంత వంటకాలు అందుబాటులోకి.
● ఆగస్టు 14న ఉదయం 8 నుంచి సంప్రదాయ క్రీడల పోటీలు, చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు. థింసా నృత్యాలు, స్వాతంత్య్ర పోరాట ఇతివృత్తాల నాటకాలు.
● ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల అనంతరం డైమండ్ జూబ్లీ ప్రత్యేక పతాకం ఆవిష్కరణ.

2478 మంది ఉంటే.. 800 మందికే రేషన్

2478 మంది ఉంటే.. 800 మందికే రేషన్