
అప్పులు చేశాక సాయం..
ఏటా నైరుతి రుతుపవనాలు జూన్ చివరిలో వచ్చేవి. ఈ ఏడాది మాత్రం మే నెల చివరి నాటికే ప్రవేశించాయి. దీంతో ఖరీఫ్ కాసింత ముందుగానే మొదలైంది. ఇది వరకు ఖరీఫ్ పనులు మొదలయ్యే నాటికే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం అందజేసేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఒక ఏడాదిని మర్చిపోయి.. రెండో ఏడాది ఆగస్టు వచ్చేనాటికి జమ చేయడం దారుణమని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రైతులు పొలాలు దుక్కి దున్నడానికి, విత్తనాలు కొనుగోలు చేయడానికి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాక ఇంత ఆలస్యంగా పథకాన్ని అమలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.