ఆటో ఢీకొని వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

Aug 1 2025 12:35 PM | Updated on Aug 1 2025 12:35 PM

ఆటో ఢ

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

పొందూరు: పొందూరు పంచాయతీ పరిధిలోని జోగన్నపేట వద్ద బుధవారం రాత్రి ఆటో ఢీకొని అదే గ్రామానికి చెందిన టొంపల సింహాచలం(80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పొందూరు నుంచి దేవరవలస వెళ్తున్న ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే వృద్ధుడు మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సింహాచలంకు ఓ కుమార్తె ఉంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

సరుబుజ్జిలి: పాతపాడు గ్రామానికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు టంకాల చినఅప్పలనాయుడు గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయనకు కుమారులు లేరు. ముగ్గురూ కుమార్తెలే. దీంతో పెద్దకుమార్తె విజయలక్ష్మి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి చితికి నిప్పంటించి రుణం తీర్చుకున్నారు.

వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ మృతికి సంతాపం

టెక్కలి: తలగాం పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ కిల్లి సావిత్రి గురువారం మృతి చెందారు. ఈమె వైఎస్సార్‌సీపీ తరఫున రెండు సార్లు సర్పంచ్‌గా సేవలు అందజేశారు. ఈయన సోదరుడు వెంకటేశ్వర్రావు ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందజేస్తున్నారు. సావిత్రి మృతి పట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌, జెడ్పీటీసీ దువ్వాడ వాణి, ఎంపీపీ ఆట్ల సరోజనమ్మ, వైస్‌ ఎంపీపీలు పి.రమేష్‌, ఎం.కిషోర్‌, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

తీర ప్రాంత భద్రతకు పక్కా చర్యలు: కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో తీర ప్రాంతాలైన బారువ, కళింగపట్నం, భావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడారు. సముద్రంలో పని చేసే ప్రతి మత్స్యకారుడు భద్రతతో కూడిన లైఫ్‌ జాకెట్‌ విధిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని, 40 శాతం సబ్సిడీతో లభించే లాబ్‌ జాకెట్లను 60 శాతం లబ్ధిదారు భరించాల్సి ఉన్నప్పటికీ అందులో 30 శాతం కలెక్టర్‌ నిధుల నుంచి సమకూరుస్తామని, మిగిలిన 30 శాతం కూడా సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి అందించే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. అయితే లైఫ్‌ జాకెట్ల పంపిణీ అనంతరం లైఫ్‌ జాకెట్‌ లేకుండా ఏ ఒక్కరు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. బీచ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తీర ప్రాంత మైరెన్‌ పోలీస్‌ స్టేషన్‌లకు బయో ఫెన్సింగ్‌ విధానంలో కాంపౌండ్‌ వాల్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా తీర ప్రాంతాలలో వాచ్‌ టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

బీసీ హాస్టల్లో మౌలిక సదుపాయాలపై ఆరా

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలోని బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన దష్టికి తీసుకురావాలని సూచించారు. శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాది కె.ఇందిరా ప్రసాద్‌, సంఘ సేవకులు పాల్గొన్నారు.

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి   1
1/4

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి   2
2/4

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి   3
3/4

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి   4
4/4

ఆటో ఢీకొని వృద్ధుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement