జెడ్పీలో పలువురికి పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో పలువురికి పదోన్నతులు

Aug 1 2025 12:35 PM | Updated on Aug 1 2025 12:35 PM

జెడ్పీలో పలువురికి పదోన్నతులు

జెడ్పీలో పలువురికి పదోన్నతులు

అరసవల్లి : జిల్లా పరిషత్‌ యాజమాన్య పరిధిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జిల్లా పరిషత్‌ బంగ్లాలో గురువారం జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ ఆధ్వర్యంలో పదోన్నతులు పొందిన వారికి కొత్తగా నియామక ఉత్తర్వులు అందజేశారు. పలాస మండల కార్యాలయం టైపిస్టు జి.లక్ష్మణరావును టెక్కలి మండల కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌గా, సీతంపేటలో టైపిస్టుగా పనిచేస్తున్న ఆర్‌.కిషోర్‌కుమార్‌కు రేగిడిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా, జలుమూరులో టైపిస్టుగా పనిచేస్తున్న జి.ఈశ్వరరావుకు నరసన్నపేటలో సీనియర్‌ అసిస్టెంట్‌గా, కంచిలిలో టైపిస్టుగా పనిచేస్తున్న సంజయ్‌కుమార్‌ సాహును సోంపేటలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు కలిపించారు. అలాగే చాపర జెడ్పీ స్కూల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌.సంపత్‌కుమార్‌ను భామినిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా, పాతపట్నంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జె.మీరాబాయిని కొత్తూరు సీనియర్‌ అసిస్టెంట్‌గా, శ్రీకూర్మంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.శివరాంను పాలకొండ సీనియర్‌ అసిస్టెంట్‌గా, మందస జెడ్పీ స్కూల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.మాలతిని సీతంపేట సీనియర్‌ అసిస్టెంట్‌గా, స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పివి.మిశ్రాను సంతబొమ్మాళిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా, జిల్లా పరిషత్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.వి.రమణను ఎచ్చెర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎచ్చెర్ల సబ్‌ డివిజన్‌లో టైపిస్టుగా పనిచేస్తున్న బి.గిరిని ఆర్‌డబ్ల్యూఎస్‌ పలాసలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా, డిప్యూటీ సీఈవో డి.సత్యనారాయణ, సీ–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement