బెంగారం | - | Sakshi
Sakshi News home page

బెంగారం

Jul 31 2025 7:34 AM | Updated on Jul 31 2025 9:18 AM

బెంగా

బెంగారం

● అబాసుపాలవుతున్న పీ–4 కార్యక్రమం ● బంగారు కుటుంబాల దత్తతకు సంపన్నుల విముఖత ● ఆ భారం ఉద్యోగులపై మోపుతున్న కూటమి సర్కారు ● ప్రభుత్వ తీరుపై సర్వత్రా మండిపాటు..

ఉద్యోగులకు

బాబుగారి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

సీఎం చంద్రబాబు పేద కుటుంబాలను పైకి తీసుకొస్తానంటే ఏదో అనుకున్నారు. ఆయన చేతిలో మంత్రదండం ఉందనేలా బిల్డప్‌ ఇచ్చారు. ఇప్పుడేమో పేదవాళ్లను పైకి తీసుకురావడం ప్రభుత్వంతో అయ్యే పనికాదని సంపన్నులపై దృష్టి పెట్టారు. వారంతా ముందుకు రావాలని చేయి చాపుతున్నారు. అలా ముందుకొచ్చే దాతలకు మార్గదర్శకులనే పేరు పెట్టారు. పేద కుటుంబాలకు బంగారు కుటుంబాలని నామకరణం చేశారు. స్వచ్ఛందంగా దాతలు రాకపోయినా బలవంతంగా అంటకడుతున్నారు. అయినప్పటికీ సంపన్నులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులే మార్గదర్శకులుగా(దాతలు) ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఐదారుగురు చొప్పున దత్తత తీసుకోవాలని టార్గెట్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

అబాసుపాలు..

ప్రభుత్వం గొప్పగా చెబుతున్న పీ–4 కార్యక్రమం అబాసుపాలవుతోంది. ప్రభుత్వం చెబుతున్న మా టలకు, ఆచరణకు పొంతన లేకుండాపోతోంది. సమాజంలోని సంపన్నులు పేదలైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్థికంగా, ఇతరత్రా అంశాల్లో అండగా ఉంటూ పైకి తీసుకొచ్చేలా పీ–4 కార్యక్రమం రూపకల్పన చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నా యి. పీ–4 కార్యక్రమం బలవంతంగా అంటగట్టే కార్యక్రమంగా మారిపోయింది. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం బంగారు కుటుంబాలను దత్తత తీసుకోనున్న మార్గదర్శకులు.. ఆ కుటుంబం ఉండటానికి ఇల్లు, ఉపాధి, పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య పరంగా ఇబ్బందులుంటే ఆదు కోవడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు టార్గెట్‌..

ఆగస్టు 15 నాటికి జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్‌ పెట్టింది. పేదలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు మందుకు రాకపోవడంతో ఉద్యోగులనే మార్గదర్శకాలుగా నమోదు చేసుకోవాలని మెడపై కత్తి పెడుతోంది. జిల్లాలో 75,566 బంగారు కుటుంబాలను సర్వే ద్వారా గుర్తించారు. ఆగస్టు 15కల్లా 59,124 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. సంపన్నుల నుంచి స్పందన రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులపైనే భారం మోపింది. ఇప్పటి వరకు జిల్లాలో 7,694 మంది మార్గదర్శకులను నయానోభయానో చెప్పి ఒప్పించింది. వీరికి 29,818 కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు ఒప్పించారు. ఇంకా 30 వేల కుటుంబాలు మిగిలి ఉంటాయి. సచివాలయం ఉద్యోగులతో కలిపి జిల్లాలో 35 వేల వరకు ప్రభు త్వ ఉద్యోగులు ఉన్నారు. వారిలో కొంతమంది ఇప్పటికే ఆన్‌లైన్‌లో మార్గదర్శకులుగా నమోద య్యారు. మిగతా వారంతా ఆగస్టు 15వ తేదీలోగా మార్గదర్శకులుగా చేరాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.

ఇదేం తీరు..

సచివాలయం ఉద్యోగులు గా ప్రభుత్వం నిర్దేశించిన విధులు నిర్వర్తిస్తాం. అయి తే బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి సంపన్నులు ముందుకు రాకపోతే సచివాలయ ఉద్యోగులే దత్త తీసుకోవాలని ప్రభు త్వ పెద్దలు చెప్పడం దారుణం. రూ.30వేల జీతంతో బంగారు కుటుంబాలను ఏ రకంగా ఆదుకోగలం? – బూరాడ మధుబాబు,

గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

నలిగిపోతున్న ఉద్యోగులు..

బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు మందుకురాకపోవడంతో ఉపాధ్యాయులు, ఇతరత్రా ఉద్యోగులతో పాటు సచివాలయం ఉద్యోగులు కూడా ఐదారుగురు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో నమోదు చేయించేలా ఎంపీడీవోల చేత సతాయిస్తోంది. దీంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున నలిగిపోతున్నారు. ముఖ్యంగా సచివాలయం ఉద్యోగులకు 30వేల లోపే జీతం ఉంటుంది. వారు కూడా పేదలైన బంగా రు కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఏవిధంగా పైకి తీసుకురాగలరో ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పటికే ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తమకు రావాల్సిన జీతభత్యాలు, పెండింగ్‌ బకాయిలు ఇవ్వకుండా ఈ కొత్త డ్రామాలేంటని నిలదీస్తున్నారు.

ఒత్తిడి తగదు..

పీ–4 అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోంది. ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగులకు కూడా బంగారు కుటుంబాలంటూ దత్తత స్వీకరించడం, సహాయ కార్యక్రమాలు చేపట్టడంపై నిర్బంధం చేయకూడదు. ఇలాగే ప్రభుత్వం వ్యవహరిస్తే ఉద్యోగుల నుంచి తీవ్ర ఆందోళన తప్పదు.

– కిలారి నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు, పి.ఆర్‌.మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం

బెంగారం1
1/2

బెంగారం

బెంగారం2
2/2

బెంగారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement