
రేపు పది మండలాల్లో విద్యుత్ కోత
●ఒక ఆధార్.. 50 విద్యుత్ కనక్షన్లు
ఎచ్చెర్ల: కొత్తపేట పంచాయతీ గాడుపేటకు చెందిన ఆటోడ్రైవర్ బుగత గోవిందరావు పిల్లలు యశ్వంత్ 9వ తరగతి, విమల 7వ తరగతి చదువుతున్నారు. వీరికి తల్లికి వందనం వర్తించలేదు. కారణమేంటని ఆరా తీస్తే 300 యూనిట్లు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని సిబ్బంది తెలియజేశారు. వాస్తవానికి గోవిందరావు 144 యూనిట్లు మించి వినియోగించలేదు. దీంతో శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లి ఆరా తీయగా అక్కడ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో గోవిందరావు అవాక్కయ్యారు. ఇతని ఆధార్ నెంబరుతో 50 విద్యుత్ మీటర్లు తీసుకున్నట్లు రికార్డుల్లో ఉందని చెప్పారు. ఎచ్చెర్ల, లావేరు, పొందూరు, రణస్థలం, జి.సిగడాం మండలాల్లో ఈ మీటర్లు ఉన్నట్లు తేలింది.
ఆది నుంచీ అవాంతరాలే..
●వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభం రోజున జూన్ 12న తల్లికి వందనం పథకం నిధుల్ని జమచేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. జీవోను విడుదల చేసి షాకిచ్చింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తొలుత నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ఊదరగొట్టిన రాష్ట్రప్రభుత్వం.. తీరా రూ.13 వేలు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.2 వేలు ఎగ్గొట్టింది. పోనీ జమ చేసిన మొత్తం అందరికీ వేశారా? అంటే అదీలేదు.
●పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది (2024–25) ఒకటి నుంచి ఇంటర్(+2) వరకు 3.05 లక్షల మంది చదువుకున్నారు. వీరిందరికీ కలిపి మొదటి ఏడాది రూ.457 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం బాకీ పడి ఉంది.
●రెండో ఏడాది 2025–26కిగాను యూ–డైస్ లెక్కల ప్రకారం ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,76,593 మంది, ఇంటర్మీడియెట్ 46,761 మంది చదువుతున్నారు. ఒకటి నుంచి ఇంటర్ మొత్తం కలిపి 3,02460 మంది చదువుతున్నారు. వీరిలో ఫస్ట్‌ఫేజ్‌లో 2,28,448 మందికి లబ్ధిచేకూర్చినట్టు అధికారులు చెబుతున్నారు. అనంతరం ఒకటోతరగతి, ఇంటర్‌లో ప్రవేశాల తర్వాత ఎంతమందికి లబ్ధి జమచేశారో స్పష్టత రావడం లేదు.
అరసవల్లి: జిల్లాలో ఆర్‌డీఎస్‌ఎస్ పథకం ద్వారా విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 10 మండలాల పరిధిలో గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి బుధవారం తెలిపారు. రణస్థలం మండలంలో కోష్ట, పిసిని ఫీడర్ల పరిధిలో వెంకటరావుపేట, వల్లభరావుపేట, దేరశాం, లావేరు మండలంలో అదపాక ఫీడర్ పరిధిలో గుర్రాలపాలెం, పైడయ్యవలస, పెద్దకొత్తపల్లి, ఎచ్చెర్ల మండలంలో కొయ్యాం, జర్జాం, ఎస్‌ఎం.పురం, బడివానిపేట, ఫరీదుపేట, కె.కె.నాయుడుపేట, పాతపట్నం మండలంలో పాతపట్నం టౌన్, ఆర్‌ఎల్‌పురం, కొరసవాడ, చెంగుడి, సరళి, సీతరాంపల్లి, బోరుభద్ర, తిద్దిమి, మెళియాపుట్టి మండలంలో చిన్నహంస, తిదిమి, మెళియాపుట్టి, కోటబొమ్మాళి మండలంలో అక్కుపల్లి, సరియాపల్లి, దంత, పోలాకి మండలంలో ఇండస్ట్రియల్ ఎక్స్‌ప్రెస్, డోల, పోలాకి, జర్జాం ఫీడర్ల పరిధిలో ఎస్‌ఎం.పురం, గొల్లలవలస, తోటాడ, సుసరాం, నడగాం, సుందరాపురం, చోడవరం, వెంకటాపురం, కవిటి మండలంలో డిజిపుట్టుగ, కుసుంపురం, మాణిక్యాపురం, దూగానపుట్టుగ, సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస, ఆమదాలవలస మండలంలో జికె.వలస, కొత్తవలస, నిమ్మతొర్లాడ, కొరపాం, సీపన్నపేట తదితర గ్రామాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.
నోట్లు, నాణేలతో సోనూసూద్
బొమ్మ