
భళా మోక్షశ్రీ
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, బలవంతపు భూసేకరణ నిలిపేయాలని కోరుతూ ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల్లో రైతులు, వామపక్ష నాయకులు, వివిధ సంఘాల నేతలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బలవంతపు భూసేకరణ చేస్తే ప్రతిఘటన తప్పదని వారంతా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒంకులూరులో కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలుస్తూ వారికి ప్రయోజనాలను చేకూర్చేలా పాలన సాగించాలే తప్ప.. కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయి ప్రజల భూములను లూటీ చేసేలా వ్యవహరించడం తగదన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు కార్గోఎయిర్ పోర్టుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యవసాయ శాఖ మంత్రివా లేక విధ్వంస శాఖ మంత్రివా అంటూ అచ్చెన్నాయుడిపై మండిపడ్డారు. కొబ్బరి, జీడి, మామిడి, పనస లాంటి పచ్చని పంటలతో విరాజిల్లుతున్న ఉద్దాన ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఢిల్లీలాంటి మహానగరంలో 150 ఎకరాల్లో మాత్రమే కార్గో ఎయిర్‌పోర్టు ఉంటే ఇక్కడ 1,400 ఎకరాలు భూమిని సేకరించాలని నిర్ణయించడం ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఉద్దానం జీడి పంటను కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో నాశనం చేస్తే పర్యవరణంతో పాటు లక్షలాది మంది రైతులు, జీడి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కార్యదర్శి జో గి అప్పారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్‌రా వు, సీపీఎంఎల్ లిబరేషన్ నాయకుడు ఎం.రామారావు, పీఓడబ్యూ జిల్లా కార్యదర్శి పి.కుసుమ తదితరులు పాల్గొన్నారు.
భళా మోక్షశ్రీ
శ్రీకాకుళం : బలగలో నివాసముంటున్న వంజరాపు సాయికుమార్, రమ్య దంపతుల కుమార్తె మోక్షశ్రీ ప్రపంచ రికార్డు సాధించింది. రెండేళ్ల ఎనిమిది నెలల వయసులోనే కెమిస్ట్రీ సబ్జెక్టులోని 30 మూలకాలను 23.37 సెకెండ్లలో చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. జూలై 16న ఆన్‌లైన్ విధానంలో ఈ ఘనత సాధించింది. ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రం మంగళవారం తల్లిదండ్రులకు చేరింది. మోక్షశ్రీ తల్లి రమ్య మత్స్యశాఖలో సాగర మిత్రగా పనిచేస్తుండగా, తండ్రి సాయికుమార్ సిమెంట్ బొమ్మలను తయారు చేస్తుంటారు. వీరి స్వస్థలం హిరమండలం అయినప్పటికీ ఉద్యోగరీత్యా దంపతులు బలగలో నివాసముంటున్నారు.
కొత్తమ్మతల్లికి గాజుల అలంకరణ
శ్రావణమాసం సందర్భంగా కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారికి బుధవారం గాజుల తో అలంకరణ చేశారు. ఆలయ ఈఓ వి.రాధాకృష్ణ నేతృత్వంలో అర్చకుడు కమ్మకట్టు రాజేష్ నేతృత్వంలో ప్రత్యేకంగా అలంకరించి పూజ లు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
– టెక్కలి

కొత్తమ్మతల్లికి గాజుల అలంకరణ