
వైరల్ జ్వరాల విజృంభణ
సారవకోట: గ్రామాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా జ్వరాల బారిన పడుతున్నారు. కొంతమంది ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తుండగా మరికొందరు సమీప పీహెచ్‌సీలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. సారవకోట, చోడసముద్రం, చిన్నగుజ్జువాడ తదితర గ్రామాల్లో జ్వరాల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. తర్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుండటంతో సారవకోట పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు దోమలు, ఈగల ఉద్ధృతి పెరగడం వ్యాధుల విజృంభణకు కారణమని తెలుస్తోంది.