
●విద్యుత్ కనెక్షన్ లేకపోయినా..
హిరమండలం: గులుమూరు పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన నిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులు వంశధార నిర్వాసితులు. ప్రస్తుతం రేకుల షెడ్‌లో నివసిస్తున్నారు. దీనికి అసలు విద్యుత్ కనెక్షనే లేదు.. కానీ 74 సర్వీసులు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో వీరు ముగ్గురు పిల్లలు హేమంత్, జస్మిత, ధార్మిక్‌లకు తల్లికి వందనం పథకం వర్తించలేదు. పెంటయ్యకు సంబంధించి ఆధార్ అనుసంధానంలో 74 కనెక్షన్లు ఉన్నట్లు ఆన్‌లైన్లో ఉంది. పోలాకి మండలంలో 5, రణస్థలం–4, జి.సిగడాం–3, లావేరు–8, పొందూరు–34, ఎచ్చెర్ల–20 విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు చూపిస్తుంది. న్యాయం చేయాలని బాధితుడు అధికారులను ఆశ్రయించినా ఇంకా ఫలితం దక్కలేదు.