
తండ్రికి తలకొరివిపెట్టిన కుమార్తె
సరుబుజ్జిలి: కుమారుడు ఉన్నప్పటికీ జబ్బుతో మంచానపడడంతో తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన సరుబుజ్జిలి మండలంలో చోటుచేసుకుంది. నందికొండ కాలనీకి చెందిన కూన సింహాచలం పక్షవాతంతో ఐదేళ్లుగా బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు కూడా గత కొద్ది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. అలాగే పెద్ద కుమార్తె అందుబాటులో లేకపోవడం వలన, పురుషోత్తపురం గ్రామానికి చెందిన చిన్న కుమార్తె పైడి అనూరాధ తండ్రి చితికి నిప్పుపెట్టి రుణం తీర్చుకుంది.