
● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్
కవిటి:
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ వరిసాగు విస్తృత స్థాయిలో సాగుతోంది. సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో పంటల్లో అధిక దిగుబడుల సాధనకు రైతులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే పంటల పెరుగుదలకు సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఎంతో అవసరమని సోంపేట సబ్ డివిజన్ ఏడీఏ టి.భవానీశంకర్ తెలిపారు. నత్రజని, భాస్వరం, పొటాష్ అందుబాటులో ఉన్నా, సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే పంటల దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. జింక్, ఇనుము, బోరాన్, రాగి, మాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ వంటి మూలకాలను సూక్ష్మపోషకాలు అంటారు. నేలలో ఏ ఒక్క సూక్ష్మ పోషక పదార్థం లోపం ఉన్నా సరైన ఫలితం ఇవ్వదు. అందువలన నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులను వేసుకొని పంట లోపాలు నివారించుకోవాలని సూచించారు.
జింక్: మొక్కల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాల సమర్థ వినియోగానికి జింక్ చాలా అవసరం.
లోపం: జింక్ లోపం ఉంటే మొక్క పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది. నాటి న రెండు నుంచి నాలుగు వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. ఇది మిగతా ఆకు అంతటా వ్యాపిస్తుంది. ఆకులు గిడసబారి దుబ్బు చేయవు. పైరుకు నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చగా ఉండదు
నివారణ చర్యలు: వరి పండించే భూముల్లో ప్రతీమూడు సార్లుకు ఒకసారి, రబీ సీజన్ రెండు పంటలు పండించే భూముల్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చల్లుకోవాలి. భాస్వరం ఎరువుతో జింక్ సల్ఫేట్ కలిపి వేయరాదు. వీటి మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలి. జింక్ సల్ఫేట్ వేయలేని పరిస్థితుల్లో పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి.
ఇనుము: ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇను ము ఆధారం. ఇది పిండి పదార్థం తయారీకి ఉపయోగపడుతుంది. అధిక క్షార భూముల్లో, సున్నపు రాయి పాలు ఎక్కువగా గల నేలలు, తేలిక నేలల్లో, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో ఇనుప దాతు లోపాలు కనిపిస్తాయి. మెట్టవరి, మెట్ట నారుమళ్లలో ఇనుప దాతులోపం సాధారణంగా కనిపిస్తుంది.
నివారణ చర్యలు: ఒక లీటర్ నీటికి 20 గ్రాముల అన్న భేది, రెండు గ్రాముల నిమ్మ ఉప్పులో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని ఐదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక మిగతా సూక్ష్మ పోషకాలు తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. మార్కెట్లో అన్ని సూక్ష్మ పోషకాల మిశ్రమం ఆగ్రోమినిమార్క్స్ రూపంలో ఫార్ములా–4 రూపంలో లభ్యమవుతాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని బట్టి పైరులో వీటిని తగిన సమయంలో వాడి అధిక దిగుబడి పొందవచ్చు.
ఖరీఫ్ వరినారులో కనిపిస్తున్న సూక్ష్మధాతు లోపం
సూక్ష్మంతోనే..
దిగుబడులకు మోక్షం..!
సూక్ష్మధాతు లోపాల నివారణ చర్యలు
మట్టి పరీక్ష: నేలలో ఏ సూక్ష్మధాతువు లోపించిందో తెలు సుకునేందుకు పంటకాలం ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి.
ఎరువుల యాజమాన్యం:మట్టిపరీక్ష ఫలితాల ఆధారంగా సూక్ష్మధాతువులను అందించే ఎరువులను అందించాలి.
పచ్చిరొట్ట పైర్లసాగు: సూక్ష్మధాతు లోపాల నివారణ కు సేంద్రియ వ్యవసాయ విధానాలు మేలు చేస్తా యి. ఇందులో ప్రధానంగా పంట సీజన్ ప్రారంభంలో కుళ్లిన పశువుల గత్తం, వర్మీ కంపోస్టును భూమి లో చల్లుకొని కలియదున్నాలి. జీలుగు, పిల్లిపెసర, నవధాన్యాల సాగువంటి విధానాలతో పచ్చిరొట్ట పైర్లను పెంచి దమ్ము సమయంలో వీటిని భూమిలో కలియదున్నాలి.
దీనికి అదనంగా ఎకరానికి కనీసం 100 కిలోల సింగిల్ సూపర్‌ఫాస్పేట్‌ను పైపాటుగా వేసుకుంటే పచ్చిరొట్ట పైరును బాగా కుళ్లిస్తుంది. దీనిద్వారా ఆ భూమిలో సేంద్రియ కర్బనంతో పాటుగా సూక్ష్మధాతువుల స్థిరీకరణకు సహాయపడుతుంది.

● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్

● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్