
రాష్ట్రస్థాయి పోటీల్లో దరహాస్ ప్రతిభ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన స్విమ్మింగ్ క్రీడాకారుడు వేమకోటి ధనుష్య విజయవాడ కేంద్రంగా ఈ నెల 26, 27 తేదీల్లో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి మోడర్న్ పెంటాథ్లెన్ పోటీల్లో సత్తాచాటాడు. తేట్రాతలాన్ (స్విమ్మింగ్, షూటింగ్, ఫెన్సింగ్, రన్నింగ్) పోరులో 4వ స్థానంలో నిలవగా, రిలే (స్విమ్మింగ్, రన్నింగ్, షూటింగ్) విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి శభాష్ అనిపించాడు. తద్వారా బంగారు పతకం సాధించి సెప్టెంబర్‌లో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. దరహాస్ ఎంపిక పట్ల స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హారికాప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, అంతర్జాతీయ వెటరన్ స్విమ్మర్ ఎస్.కాంతారావు, డీఎస్‌డీఓ డాక్టర్ శ్రీధర్‌రావు, డీఎస్‌ఏ కోచ్ మురళీధర్, మోడర్న్ పెంటాథ్లెన్ జిల్లా కార్యదర్శి చక్రదర్, ఒలింపిక్, పీఈటీ సంఘ నాయకు హర్షం వ్యక్తంచేశారు.