
రైలు ఢీకొని యువకుడు మృతి
నరసన్నపేట : కామేశ్వరిపేట సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం ఉర్లాం రైల్వేస్టేషన్ మాస్టర్ నుంచి సమాచారం రావడంతో ఘటనా స్థలానికి వెల్లి పరిశీలించగా మృతుడు శ్రీకాకుళం టౌన్ బలగ పరిధిలోని బుచ్చిపేటకు చెందిన జడుగుల చిట్టిబాబు(31)గా గుర్తించినట్లు హెచ్‌సీ మదుసూదనరావు తెలిపారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉందన్నారు. సోమవారం సాయంత్రం రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.