
పీ–4 పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్
నరసన్నపేట:
సర్కారు టీచర్ల నెత్తిన ప్రభుత్వం నిత్యం కొత్త భారాలు వేస్తోంది. ఇప్పటికే పలు యాప్‌ల నిర్వహణలతో టీచర్లపై విపరీతమైన భారం ఉంది. దీనికి అదనంగా ప్రభుత్వం పీ–4 బాధ్యతలను కూడా ఉపాధ్యాయులకు అప్పగించింది. ప్రతి ఉపాధ్యాయుడు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని, ఆ కుటుంబాలను బంగారు కుటుంబాల పేరుతో వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రధాన ఉపాధ్యాయు లు కనీసం ఐదు కుటుంబాలను, ఉపాధ్యాయులు కనీసం రెండు కుటుంబాలను దత్తత తీసుకొని రిజిస్టర్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తరగతులపై ప్రభావం
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నే ర్పించాల్సిన ఉపాధ్యాయులు బోధనేతర విధులతో ఇప్పటికే సతమతమవుతున్నారు. విద్యా సంవత్స రం ప్రారంభమైనప్పటి నుంచి యోగాంధ్ర, పేరెంట్ మీటింగ్స్, యాప్‌లు, శిక్షణ, ఫొటోల అప్‌లోడ్ వంటి పనులు అప్పగించడంతో వీరంతా విసుగు చెందుతున్నారు. దీని ప్రభావం తరగతుల నిర్వహణపై పడుతోంది. బోధన సమయం తగ్గిపోయి మొక్కుబడిగా పాఠాలు చెప్పే పరిస్థితి స్కూల్స్‌లో నెలకొంది. దీనిపై ఒక వైపు ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టోగా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే.. తాజాగా ప్రభుత్వం పీ–4 పిడుగును వారి నెత్తిన వేసింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై నిరసన రాగం వినిపిస్తున్నాయి. మధ్య తరగతి శ్రేణిలో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేరే కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉండదనే నిజాన్ని ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలని టీచర్ల సంఘ నాయకులు చెబుతున్నారు. యాప్‌లో 70 రకాలకు పైగా ఉన్న టైల్స్ రద్దు చేసి బోధనా స్వేచ్ఛ కల్పించి, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మరింత దగ్గర చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు పీ–4 దత్తత బాధ్యతల అప్పగింత
విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ హెచ్‌ఎం, టీచర్లకు ఆదేశాలు
ఇప్పటికే పలు యాప్‌లతో
పెరిగిన పని భారం
మానసిక క్షోభకు
గురి చేయవద్దంటున్న ఉపాధ్యాయులు
ఒత్తిడి చేయడం సరికాదు
పీ–4పై ఉపాధ్యాయ వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇప్పటికే హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులపై అనేక రకాలుగా బోధనేతర బాధ్య తలు పెంచుతున్నారు. వీటితోనే సతమతమవుతుంటే మళ్లీ పీ–4 పేరున అదనపు భారం పెట్ట డం సరికాదు. –బమ్మిడి శ్రీరామ్మూర్తి,
ఫ్యాఫ్టో చైర్మన్, శ్రీకాకుళం
టీచర్లపై రుద్దడం అన్యాయం
పీ–4 కార్యక్రమం పేరిట ఉపాధ్యాయులు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెబుతున్నారు. ఇది అన్యాయం. టీచర్లను బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. ఉపాధ్యాయ వర్గాలు కూడా మధ్య తరగతి శ్రేణులకు చెందిన కుటుంబాలే అనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలి.
– తమ్మినాన చందనరావు, ఏపీఎస్‌టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకోవాలని, వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేయడం బాధాకరం. బోధనేతర కార్యక్రమాలతో ఇప్పటికే పాఠాలను సక్రమంగా బోధించలేక ఒత్తిడికి గురి అవుతున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
– బి.కేశవరావు, మండల శాఖ అధ్యక్షుడు
ఏపీటీఎఫ్ (1938), నరసన్నపేట
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం పీ–4 విధానం ప్రవేశపెట్టిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 75,566 బంగారు కుటుంబాలను, 5171 మార్గదర్శకులను గుర్తించామని, ఇందులో 24 వేల కుటుంబాలను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు వచ్చారని, వారికి అనుసంధానం చేసినట్లు చెప్పారు. ప్రణాళిక విభాగం సారథ్యంలో గ్రామ, వార్డు సచివాల య సిబ్బంది సర్వే చేసి నిరుపేద కుటుంబాలను గుర్తించారని, ఆగస్ట్ 15వ తేదీ లోపు జిల్లా లో ఇంత వరకు గుర్తించిన 75 వేల కుటుంబాలను దత్తత తీసుకొనే కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

పీ–4 పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

పీ–4 పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

పీ–4 పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

పీ–4 పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్