
ప్రభుత్వ భూమి కాజేసే కుట్ర
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం మల్లికార్జునపురం రెవెన్యూ పరిధిలో ఓ ఘరానా మో సం వెలుగు చూసింది. 2.80 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరగడంతో స్థానికులు కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. మల్లికార్జునపురం రెవెన్యూ పరిధిలోని అటవీ భూములు ఉన్నాయి. అయితే అందులో సర్వే నంబర్ 17/3ఏ పరిధిలో 2 ఎకరాల 10 సెంట్లు, 161/3ఏలో 70 సెంట్లు భూమిని కోట సూర్యనారాయణ అనే వ్యక్తికి ప్రభుత్వం డీ పట్టా కింద మంజూరు చేసిందని చూపిస్తూ.. రూ.2కోట్లకుపైగా విలువైన ఈ భూమిని కాజే సే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తు లు చెబుతున్నారు. అయితే గత కొద్దిరోజులుగా దీనిపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టెక్కలి ఆర్డీఓ మండల రెవెన్యూ అఽధికారులను పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు.
తాజాగా ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కోట సూర్యనారాయణ కుమారుడు శ్రీనివాసరావు అనే హోంగార్డ్ ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదుచేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బొర్రంపేట సచివాలయంలో పనిచేస్తున్న వీఆర్‌ఏ సైలాడ దుర్గారావు సూత్రధారి అని ఆరోపిస్తున్నారు. హోంగార్డుగా పనిచేస్తున్న కోట శ్రీనివాసరావుతో కలిసి ఈ అటవీ భూమి పై కన్నేసినట్టు తెలుస్తోంది. దాదాపు దశాబ్దం కిందటే చనిపోయిన సూర్యనారాయణ పేరు మీద ఈ భూమి ఉందని చూపిస్తూ కొట్టేసే వి ధంగా ఇద్దరూ ప్లాన్ చేసుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి ఉమ్మడి సరుబుజ్జిలి మండలం డీపట్టా రిజిస్టర్‌లో ఫోర్జరీ చేసి పేర్లు తారుమారు చేసి రూ.2 కోట్ల విలువైన ఆస్తిని కాజేసే కుట్ర జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని మల్లికార్జునపురం, బొర్రంపేట గ్రామస్తులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
మల్లికార్జునపురం భూములకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడం నేరం. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం.
– జె.ఈశ్వరమ్మ తహసీల్దారు, ఎల్‌ఎన్‌పేట
నకిలీ పత్రాలతో స్వాధీనానికి ప్రయత్నం
కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన మల్లికార్జునపురం గ్రామస్తులు

ప్రభుత్వ భూమి కాజేసే కుట్ర

ప్రభుత్వ భూమి కాజేసే కుట్ర