
వైఎస్సార్‌సీపీ కార్యకర్త ద్విచక్ర వాహనం ధ్వంసం
● వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడికి ప్రయత్నించిన టీడీపీ నాయకుడు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
టెక్కలి: మండలంలోని అయోధ్యపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దుంపల ఈశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త టీడీపీ నాయకుడు బగాది హరి మంగళవారం ఇనుప రాడ్డుతో దాడికి ప్రయత్నించాడు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త తప్పించుకుని తన ఇంటిలోకి వెళ్లిపోవడంతో బయ ట ఉన్న ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశాడు. ఈ మేరకు బాధితుడు ఈశ్వరరావు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు హెచ్.వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్, వైస్ ఎంపీపీ పి.రమేష్, జిల్లా నాయకుడు సత్తారు సత్యంతో పాటు మరి కొంత మంది మండల నాయకుల సహకారంతో మంగళవారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఇంటి వద్ద నిలుచుని ఉండగా టీడీపీ నాయకుడు బగాది హరి ఇనుప రాడ్డు పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నించాడని, ఆ దాడి నుంచి తప్పించుకుని ఇంట్లో తలదాచుకున్నానని, దీంతో ఇంటి బయట ఉన్న తన ద్విచక్రవాహనాన్ని రాడ్డుతో ధ్వంసం చేశాడని బాధితుడు ఈశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బగాది హరి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకు లు మాట్లాడుతూ దాడికి పాల్పడిన బగాది హరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ఫిర్యాదు అందజేసిన వారిలో వైఎస్సార్‌సీపీ నాయకులు కె.అజయ్, వి.శ్రీధర్‌రెడ్డి, వి.తవిటయ్య, బి.రాజేష్, బి.కార్తీక్, మోదుగువలస గణపతిరావు, ఎం.రమేష్, ఎం.కృష్ణ ఉన్నారు.