
కుప్పిలి మాస్ కాపీయింగ్‌పై విచారణ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య మీద వచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సమగ్రశిక్ష కార్యాలయంలో సోమవారం వి చారణ నిర్వహించారు. విచారణ అధికారిగా విద్యా శాఖ స్టేట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ జేఏసీ నా యకుల ముందు ఎనిమిది ప్రశ్నలను విచారణ అధికారి ఉంచారు. లావేరు ఎంఈఓ–1గా వ్యవహరించిన ఎం.వాగ్దేవి, ఎచ్చెర్ల ఎంఈఓ–2 రాజ్‌కిశోర్ సైతం విచారణ అధికారి ఎదుట హాజరయ్యా రు. లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని విచారణ అధికారులు సూచించారు. భోజనం అనంతరం ఇస్తానని డీఈఓ దాటవేత ధోరణి ప్ర దర్శించినట్లు పలువురు తెలిపారు. పరీక్ష కేంద్రంలో దొరికాయని చెబుతున్న స్లిప్పులకు, ప్రశ్నపత్రానికి సంబంధం లేదని, ఇన్విజిలేటర్ సంతకం లేకుండా ఉద్దేశపూర్వకంగా డీబార్ చేయడం అశాసీ్త్రయమని సంఘ నేతలు తమ లిఖితపూర్వక వాగ్దానంలో రాసిచ్చినట్లు సమాచారం. బుడగట్లపాలెం, కొ య్యాం పాఠశాల ప్రధానోపాధ్యాయులను డీఈఓ పిలిపించుకొని కుప్పిలి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల జూనియర్ అసిస్టెంట్ కిశోర్‌కు డబ్బులిచ్చామని బలవంతంగా స్టేట్‌మెంట్లు రాయించుకున్నారని ఆరోపించారు. డీఈఓపై చర్యలు తీసుకోవాలని కోరారు. 14 మంది టీచర్లపై చార్జీలను, క్రిమినల్ కేసులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని విచారణ అధికారికి విన్నవించారు.