ఐసీడీఎస్‌ పీడీగా విమల | - | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌ పీడీగా విమల

Jul 28 2025 12:14 PM | Updated on Jul 28 2025 12:14 PM

ఐసీడీ

ఐసీడీఎస్‌ పీడీగా విమల

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ పథక సంచాలకులుగా ఐ.విమల నియమితులయ్యారు. ఈమె ఆదివారం జిల్లా ఐసీ డీఎస్‌ పీడీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో కడప జిల్లా పోరుమామిళ్లలో సీనియర్‌ సీడీపీఓగా పనిచేశారు. ఐసీడీఎస్‌ పీడీగా పదోన్నతిపై శ్రీకాకుళం జిల్లాకు వచ్చా రు. ప్రస్తుతం ఐసీడీఎస్‌ పీడీగా పనిచేసిన బి.శాంతిశ్రీతన మాతృసంస్థ అయిన కో–ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లారు.

పిచ్చి కుక్కల స్వైర విహారం

బూర్జ: మండలంలోని కొల్లివలస గ్రామంలో ఆదివారం ఉదయం పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 12 మందిని కరిచింది. వీరంతా శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కొల్లివలస గ్రామానికి చెందిన సీర లక్ష్మినారాయణ, మేడి గిరి, గడే కిషోర్‌, గడే పార్వతి, పి.రమణమ్మ, మంతిని ఈశ్వరమ్మతో పాటు మరికొందరిపై పిచ్చి కుక్క దాడి చేయడంతో వీరిని వెంటనే 108 సాయంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

టెక్కలిలో..

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం జర్జంగి పంచాయతీ పరిధి గుంజిలోవ గ్రామంలో ఆదివారం వేకువజామున పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదివారం వేకువజాము న గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నడిచి వెళ్తుండగా వారిపై దాడిచేసింది. అలానే గ్రామంలో ఉన్న 9 ఆవులు, 4 ఎద్దులు, 3 పెయ్యలు కలిపి మొత్తం 16 పశువులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం ఆ కుక్కసైతం మృతి చెందిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారులు గ్రామానికి చేరుకుని కుక్కదాడిలో గాయపడిన పశువులకు టీకాలు వేశారు.

‘ఎయిర్‌ పోర్టుకు అంగుళం స్థలం ఇచ్చేది లేదు’

వజ్రపుకొత్తూరు రూరల్‌: పచ్చని ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి అంగుళం స్థలం కూడా ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. తోటూరు గ్రామంలో శనివా రం రాత్రి కార్గో ఎయిర్‌ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ ప్రాంతాన్ని విధ్వంసం చేసే ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ముందుకు వెళ్తే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, ఉపాధ్యక్షుడు ఎల్‌.రామస్వామి, కార్యదర్శి జోగి అప్పారావు, గుంట లోకనాథం, మడ్డు జానకిరావు, ఎం.పురుషోత్తం, ధనరాజు, పి.నారాయణ, ఉప్పాడ దుర్గారావు, ఎస్‌.కృష్ణవేణి, జి.చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఐసీడీఎస్‌ పీడీగా విమల 1
1/1

ఐసీడీఎస్‌ పీడీగా విమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement