
శభాష్ మేజర్ కవిత
జి.సిగడాం మండలం జగన్నాథవలస ప్రాథమికోన్నత పాఠశాల చుట్టూ మురుగునీరు పేరుకుపోయింది. దీంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనా నీరు నిల్వ ఉండిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – జి.సిగడాం
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాకు చెందిన మేజర్ కవిత వాసుపల్లి చేసిన ఎన్నో ధైర్య సాహసాలు యువతకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయి. జమెట్టూరు గ్రామానికి చెందిన కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అభినందించారు. వీఎస్‌ఎమ్, సాహసం మరియు సేవా రంగాలలో అసాధారణ ఘనత సాధించిన ఈమె ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. సాధారణ కుటుంబంలో జన్మించిన వాసుపల్లి కవిత చదువుల సరస్వతిగా కీర్తిగడించింది. శ్రీకాకుళం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, 2021లో భారత సైన్యంలో వైద్యురాలిగా చేరింది. తన కుటుంబాన్ని ఆదుకోవడమే కాక, దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో.. కేవలం నాలుగేళ్లలో నిబద్ధత కలిగిన వైద్యాధికారిణిగానే కాకుండా.. నాయకత్వం మరియు సాహసానికి చిహ్నంగా ఎదిగారు. మౌంట్ గోరిచెన్ ఎక్కే సమయంలో, 5,900 మీటర్ల ఎత్తులో స్పృహ కోల్పోయిన సహయాత్రికుడిని ఆమె రక్షించారు. ఆమె మేధస్సు, ధైర్యానికి భారతసైన్యం ఫిదా అయింది. ఇటీవల బ్రహ్మపుత్ర నదిపై 1,040 కిలోమీటర్ల రాఫ్టింగ్ యాత్రను పూర్తి చేసిన ఏకై క మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ ఘనతకు ఆమె పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో నమోదైంది. ఈ యాత్రను నిమాస్ డైరెక్టర్, షౌర్య చక్ర గ్రహీత, మౌంట్ ఎవరెస్ట్‌ను మూడు సార్లు అధిరోహించిన మొదటి భారతీయుడు కల్నల్ రణవీర్ సింగ్ జామ్‌వాల్, ఎస్‌ఎమ్, వీఎస్‌ఎమ్ నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కవిత ఆదివారం కలిశారు. ‘మేజర్ కవిత కథ అద్భుతమైన సంకల్పాన్ని చూపిస్తోంది. ఆమె ఆంధ్రప్రదేశ్‌కు , ప్రతి భారతీయుడికీ గౌరవాన్ని తీసుకువచ్చారు.. నీ రాష్ట్రానికి, దేశానికీ మరింత గౌరవం తీసుకురావాలి,’’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు.
రాష్ట్ర గవర్నర్ అభినందనలు అందుకున్న సిక్కోలు మేజర్
బ్రహ్మపుత్ర నదిపై రాఫ్టింగ్ యాత్ర చేసిన ఏకై క మహిళగా రికార్డు
కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముచ్చటిస్తున్న మేజర్ కవిత
లక్ష్యం ఎవరెస్ట్
‘బ్రహ్మపుత్ర అద్భుతంగా ఉంది కానీ దయలేని నది. అనేక సార్లు, అతి పెద్ద అలలు మన రాఫ్ట్‌ను తిప్పేశాయి. ఆ క్షణాల్లో, మేమంతా నీటిలో మునిగి, బతికేం లేదా అనే అనుమానంలో పడ్డాం. అయినా భయపడకుండా లక్ష్యం చేరుకున్నాం. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో కొనసాగాలనుకుంటున్నాను. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనే లక్ష్యం ఉంది. గవర్నర్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. –డాక్టర్ మేజర్ కవిత వాసుపల్లి,
ఇండియన్ ఆర్మీ వైద్యురాలు