సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు

Jul 26 2025 9:40 AM | Updated on Jul 26 2025 10:06 AM

సచివా

సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు

మెళియాపుట్టి: స్థానిక సచివాలయ ఉద్యోగులు చేసిన తప్పిదానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీఓ నరసింహప్రసాద్‌ పండా తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మూగి భాస్కరరావు, కృష్ణవేణిల ఇద్దరు కుమారులు మూగి మోక్షిత్‌, మూగి షారుఖ్‌లు సచివాలయ ఉద్యోగుల తప్పిదం కారణంగా తల్లికి వంద నం పథకానికి అనర్హులయ్యారు. హౌస్‌ హోల్డ్‌ సర్వేలో అధికారులు వారిద్దరూ చనిపోయిన ట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో వారికి నగదు అందలేదు. దీనిపై తల్లిదండ్రులు జేసీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశానుసారం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు ఎంపీడీ ఓ తెలిపారు.

జీడి రైతుకు సత్కారం

కాశీబుగ్గ: వన్‌ డిస్ట్రిక్‌ వన్‌ ప్రొడక్టు (ఓడీఓపీ) కార్యక్రమానికి జిల్లా పలాస జీడిపప్పు ఎంపికై న సందర్భంగా.. పారిశ్రామిక వేత్తలతో పాటు వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన రైతు యంపల్లి నారాయణను సత్కరించారు. ఆలిండియా కాష్యూ అసోసియేషన్‌ చైన్నె మహాబలిపురంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ కాష్యూ మాన్యుఫ్యాక్చర్‌ అసోసియేషన్‌ ఆహ్వా నం మేరకు రైతు వెళ్లారు. పలాస పరిసర ప్రాంతంలో ఉద్దానంలో రైతులు పండించిన జీడి పంట కారణంగా పేరుప్రఖ్యాతలు వచ్చాయ ని ఏపీసీఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లా కాంతారావు తెలిపారు.

అబ్బాయిపేటలో చోరీ

జలుమూరు: జోనంకి పంచాయతీ అబ్బాయిపేటకు చెందిన ఉప్పాడ నరసమ్మ ఇంటిలో దొంగతనం జరిగింది. చోరీలో రూ.60వేల విలువై న బంగారం పోయినట్లు ఆమె తెలిపారు. పది రోజుల కిందట ఆమె హరిదాసుపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉద యం తిరిగి వచ్చి చూసే సరికి బీరువా తెరిచి ఉంది. అందులో బంగారంతో పాటు కొన్ని వస్తువులు కనిపించలేదు. ఇంటి తలుపు తీసి బీరువా పగలగొట్టి లోపల లాకర్‌ తెరిచారని ఆమె తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

రణస్థలం: రణస్థలంలోని ఓ ఇంటికి స్లాబ్‌ ఇనుప రాడ్లు కడుతున్న సమయంలో విద్యుత్‌ తీగలు తగలడంతో కె.గోవిందరావు(48) అనే వ్యక్తి మృతి చెందాడు. జేఆర్‌ పురం పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని జోగిరాజుపేట గ్రామానికి చెందిన గోవిందరావు స్లాబ్‌ పనికి రాడ్లు కట్టేందుకు శుక్రవారం ఉదయం 8.15 గంటలకు రణస్థలం వచ్చారు. స్లాబ్‌పై పని చేస్తున్న సమయంలో విద్యుత్‌ తీగలు తగలడంతో చలనం లేకుండా పడిపోయారు. తోటి కా ర్మికులు గుర్తించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు 1
1/1

సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement