
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు
వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉద్దానం గోపినాథపురానికి చెందిన దున్న హేమారా వు, మరో మహిళ కు తీవ్ర గాయాలయ్యాయి. పూండి నుంచి పలాస వైపు పాఠశాలలకు చెందిన పుస్తకాల లోడుతో వెళుతున్న శ్రీకాకుళానికి చెందిన వ్యాన్ పలాస నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న హేమారావును బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనం ధ్వంసం కాగా వెనుక ఉన్న మహిళకు తీవ్ర గాయాలై కాలు విరిగిపోయింది. వాహనం నడుపుతున్న హేమరావుకు తలకు, ఇతర చోట్ల బలమైన గాయాలయ్యాయి. స్థానికులు అక్కడకు చేరుకుని 108 వాహనానికి సమాచారం అందించి హుటాహుటిన పలాస ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను శ్రీకాకుళం తీసుకెళ్లా రు. వజ్రపుకొత్తూరు పోలీసులు సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.
సినిమాకు వెళ్లి వస్తుండగా..
కవిటి: సోంపేటలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చూసి తిరిగి వస్తుండగా ముగ్గురు యువకులు రో డ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. కవిటి మండలంలోని బొరివంక వద్ద గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం కేసు నమో దు చేసినట్టు ఎస్‌ఐ వి.రవివర్మ విలేకరులకు తెలిపా రు. కవిటి మండలం కపాసుకుద్దికి చెందిన కర్రి మే ఘనాథం, కర్రి జోగారావు, వంక రాజులు గురు వా రం సినిమా చూద్దామని ముగ్గురూ ఒకే బైక్‌పై సోంపేట వెళ్లారు. సినిమా చూసి తిరిగి వస్తుండగా తల తంపర వద్ద ఒకరిని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపా రు. అక్కడ గొడవ జరుగుతుందేమోనన్న భయంతో వాహనాన్ని వేగంగా నడుపుతూ బొరివంక వద్ద స్పీడ్‌బ్రేకర్‌ను తప్పించే ప్రయత్నంలో పక్కన ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. స్థానికులు అంబులెన్స్‌కు సాయంతో సోంపేట ఆస్పత్రికి తరలించారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు