
‘న్యాయవాదులకు రక్షణ చట్టం చేయాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదు లు డిమాండ్ చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకు ళం జిల్లా కోర్టు మెయిన్ గేటు వద్ద నిరసన తెలిపా రు. న్యాయవాదుల రక్షణ చట్టం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నా యని అన్నారు. న్యాయవాదుల మరణం తర్వాత వారి వారసులకు చెల్లించే పరిహారం రూ.పది లక్ష లకు పెంచాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.పది వేలు ఇవ్వాలని కోరారు. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.