
ఎందుకంత నీరుత్సాహం!
హిరమండలం: జల వనరుల శాఖలో ‘నీరు’త్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మ న్యంలో ఒకే అధికారి ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తున్నారు. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే వంశధార ప్రాజెక్టులో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ ఉద్యోగుల కొరత వెంటాడుతోంది. దీంతో ఇది ప్రాజెక్టులు, కాలువల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. ఏళ్ల తరబడి ఇక్కడి పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఏటా ఖరీఫ్, రబీలో సాగునీటి విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆరు డివిజన్లకు ఇద్దరే ఈఈలు
వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమైనది గొట్టా బ్యారేజీ. దీని పరిధిలోని కుడి, ఎడమ ప్రధాన కాలువలు, ఎత్తిపోతల పథకాలు, వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, వంశధార–నాగావళి అనుసంధాన కాలువలు ఉన్నాయి. వీటి నిర్వహణ ఒకరిద్దరితో కాదు. అన్ని విభాగాల్లో అధికారులు, సిబ్బంది ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ ఎక్కడా పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది లేకపోవడం లోటుగా మారింది. ప్రస్తుతం వంశధార ప్రాజెక్టు పరిధిలో నరసన్నపేట, టెక్కలి, ఆమదాలవలస–1, ఆమదాలవల స, శ్రీకాకుళం, హిరమండలం డివిజన్లు ఉన్నా యి. ప్రాజెక్టు కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో ఈఈల పాత్ర కీలకం. ఒక్క ఆమదాలవలసలోని రెండు డివిజన్లకు మాత్రమే ఈఈలు ఉన్నారు. మిగతా నాలుగుచోట్ల పూర్తిగా లేరు. ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. అందుకే ప్రాజెక్టుల కార్యకలాపాలతో పాటు క్షేత్రస్థాయిలో నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు ఏఈలతో పాటు ఏఈఈలు కూడా తక్కువ మందే ఉన్నారు. ఏఈలు 13 మందికిగాను ఐదుగురు, ఏఈఈలు 58 మందికిగాను 36 మంది ఉన్నారు. దీంతో అన్నీతామై వారే వ్యవహరించాల్సి వస్తోంది.
గొట్టాకు తప్పని కష్టాలు
● గొట్టా బ్యారేజీ నిర్వహణ కూడా కష్టం అవుతోంది. సిబ్బంది కొరత వెంటాడుతోంది.
● గతంలో బ్యారేజీ నిర్వహణకు సంబంధించి 22 మంది ఉద్యోగులు పనిచేసేవారు.
● వర్క్ ఇన్‌స్పెక్టర్లు ముగ్గురుండాలి కానీ ప్రస్తు తం ఒక్కరే ఉన్నారు.
● హెల్పర్లు ఆరుగురు ఉండాలి కానీ ఇద్దరున్నా రు. మేన్ మజ్దూర్లు 8 మంది ఉండాలి, కనీసం ఒక్కరూ లేరు.
● ఆపరేటర్లు ముగ్గురుండాలి కానీ ఒక్కరు కూడా లేరు. ఎలక్ట్రీషియన్లు ఇద్దరుండాలి.. ఒక్కరూ లేరు. ఏఈలు నలుగురు ఉండాలి.. ఇద్దరు ఉన్నారు. లస్కర్లు పూర్తిగా లేరు.
● సిబ్బంది కొరత కారణంగా నీటి స్థిరీకరణ, నీటి విడుదల, గేట్లు ఎత్తినప్పుడు, అత్యవసర సమయాల్లో ఉన్న ముగ్గురిపై భారం పడుతోంది.
మూడు జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు
ఎస్‌ఈగా ఒకే అధికారి
జలవనరుల శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత
ముగ్గురితోనే గొట్టా బ్యారేజీ నిర్వహణ
ఇన్‌చార్జి ఎస్‌ఈ దిక్కు..
ఏ సాగునీటి ప్రాజెక్టుకు అయినా సూపరింటెండెంట్ అధికారి (ఎస్‌ఈ) కీలకం. కానీ వంశధార ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎస్‌ఈ లేరు. గత ఆరేళ్లుగా ఇక్కడ ఇన్‌చార్జే కొనసాగుతున్నారు. వారు కూడా ఎప్పుడు ఉంటా రో? ఎప్పుడు ఉండరో? తెలియని పరిస్థితి. రెగ్యులర్ అధికారి పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభు త్వం పట్టించుకోవడం లేదు.
సిబ్బంది కొతర వాస్తవమే..
వంశధార ప్రాజెక్టుతో పాటు గొట్టా బ్యారేజీకి సంబంధించి సిబ్బంది కొరత వాస్తవమే. అయినా సరే ఉన్న సిబ్బందితో పనులు చేయిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. సిబ్బందికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభు త్వం తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటుంది. – ఎం.మురళీమోహన్
వంశధార ఈఈ, నరసన్నపేట డివిజన్

ఎందుకంత నీరుత్సాహం!

ఎందుకంత నీరుత్సాహం!