
‘టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారికే ఎరువులు’
టెక్కలి: టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారికే ఎరువులు ఇస్తున్నారంటూ కోటబొమ్మాళి మండ లం మాసాహెబ్‌పేట గ్రామ సచివాలయం వద్ద గురువారం రైతులు ఆందోళనకు దిగారు. పంచాయతీ పరిధిలో రైతుల కోసం సుమారు 800 బస్తాల యూరియా, 200 బస్తాలు డీఏపీ బస్తాలు వచ్చాయని అయితే అందరికీ సమానంగా ఎరువులు ఇవ్వకుండా టీడీపీ కార్యకర్త లు చెప్పిన వారికే ఇష్టానుసారంగా ఎరువులు పంచిపెట్టేశారని రైతులు నిలదీశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని సమానంగా ఎరువులు అందజేసేవారని గుర్తు చేశారు.
కేవీకే శాస్త్రవేత్తకు అవార్డు
ఆమదాలవలస: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ బాలకృష్ణకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. గురువారం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు పొందిన డాక్టర్ సీహెచ్ బాలకృష్ణను కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మితో పాటు పలుశాఖలకు చెందిన శాస్త్రవేత్తలు అభినందించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గ వర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డు అందుకున్నారు. ఆక్వా కల్చర్‌లో నూతన సాంకేతిక పద్ధతులను రైతులకు వివిధ విస్తరణ శిక్షణ కార్యక్రమాల ద్వారా అవగాహ న కల్పించడం, చేపలు రొయ్యల సాగులో వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి వాటి నివారణలో రైతులకు సహకార మత్స్య సహకార సంఘ సభ్యులకు అవగాహన కల్పించి పలు సూచనలు ఇచ్చేవారు. జిల్లాలో చేప పిల్లల పెంపకాన్ని ప్రోత్సహించి పరిశోధనలు, ప్రముఖ జర్నల్‌లో పరిశోధన పత్రాల సమ ర్పించారు. వీటన్నింటినీ పరిగణించి ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపిక చేశారని, ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్న బాలకృష్ణ వివరించారు.
‘పోలీసుల ఏకపక్ష వైఖరి వల్లే ఆత్మహత్యాయత్నం’
సరుబుజ్జిలి: సరుబుజ్జిలి పోలీసుల ఏకపక్ష వైఖరి వల్ల రొట్టవలస గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త ధనుకోట శ్రీను విసుగుచెంది గురువారం పురుగులు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పార్టీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవినాగ్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కార్య కర్తను ఆయన పరామర్శించారు. శ్రీను అధికా ర పక్షానికి చెందిన ఓ వ్యక్తికి డబ్బు ఇవ్వాల్సి ఉందనే నెపంతో బలవంతంగా శ్రీనుకు చెందిన లగేజీ వ్యాన్‌ను అతడికి అప్పగించేశారని, ఈ వాహనాన్నే నమ్ముకుని బతుకుతున్న శ్రీను మనస్తాపం చెందిన పురుగు మందు తాగేశాడని తెలిపారు. తక్షణమే ఎస్పీ స్పందించి బాధితునికి న్యాయం చేయాలని కోరారు.
28న కుప్పిలి సంఘటనపై విచారణ
శ్రీకాకుళం: జిల్లాలో ఈ ఏడాది మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల సందర్భంలో కుప్పిలిలో జరిగిన సంఘటనకు సంబంధించి విచా రణను ఈనెల 28న చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీజీ శ్రీనివాసులురెడ్డిని విచారణాధికారిగా నియమించింది. ఆరోజు మాస్ కాపీయింగ్ జరిగిందంటూ ప్రధానోపాధ్యాయున్ని, 13 మంది ఉపాధ్యాయులను, ఓ గుమస్తాను డీఈఓ తిరుమల చైతన్య సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై దుమారం చెలరేగగా ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తూ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు సస్పెండ్ అయిన వారిని రీవోక్ చేసి విధులను కేటాయించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు విచారణకు డిమాండ్ చేయగా తాత్సారం చేస్తూ వచ్చిన రాష్ట్ర స్థాయి అధికారులు తాజాగా విచారణను చేపట్టాలని నిర్ణయించి ఈనెల 28న 11గంటలకు జరిగే విచారణకు డీఈఓ తిరుమల చైతన్యతో పాటు సస్పెన్షన్‌కు గురైన వారంతా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈనెల 30వ తేదీన డీఈఓ తిరుమల చైతన్య పదవీ విరమణ చేయనుండడం గమనార్హం.

‘టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారికే ఎరువులు’