
ఆ గ్రామానికి ఏమైంది?
జి.సిగడాం :
టంకాల దిగ్గువలస గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. నెల రోజులుగా గ్రామంలో ఏ ఇంట చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి తగ్గితే వెంటనే మరొకరు మంచంపడుతున్నారు. మూడు నుంచి ఐదు రోజుల తర్వాత దురదలువచ్చి కాళ్ల పొంగులు, కీళ్లు నొప్పులు బాధిస్తున్నాయని జ్వరపీడితులు చెబుతున్నారు. స్థానిక వైద్యాధికారులు బుడుమూరు యశ్వంత్, పేకల సుమబిందు ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా ఫలితం ఉండటం లేదు. ఇప్పటికే తాగునీటి బోర్లు, బావుల్లో నీటిని పరీక్ష చేయించారు., ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావు పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు. మరోవైపు దోమల నివారణ మందులను ఫాగింగ్ చేయిస్తున్నారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఆందోళనగా ఉంది..
జ్వరం రావడంతో వైద్యసిబ్బంది వచ్చి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. జ్వరం తగ్గాక కాళ్ల నొప్పులు, కాళ్లపొంగులు వచ్చాయి. నెల రోజులుగా నరకయాతనపడుతున్నాం. – గిడిజాల శ్రీరాములు,
టి.డి.వలస, జి.సిగడాం మండలం
మళ్లీ జ్వరం..
వారం రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గిపోయింది. మళ్లీ జ్వ రం రావడంతో పాటు కాళ్లనొప్పులు, పొంగులు ప్రారంభమయ్యాయి. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటోంది.– టంకాల భాస్కరరావు, టి.డి.వలస
ప్రతిరోజూ వైద్యసేవలు
టి.డి.వలసలో నెల రోజులుగా ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. రోగుల ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నాం. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యసేలు అందిస్తున్నాం.
– బుడుమూరు యశ్వంత్, వైద్యాధికారి,
జి.సిగడాం
●
టి.డి.వలసను కుదిపేస్తున్న జ్వరాలు
కాళ్లపొంగులు, కీళ్లనొప్పులతో గ్రామస్తుల అవస్థలు

ఆ గ్రామానికి ఏమైంది?

ఆ గ్రామానికి ఏమైంది?

ఆ గ్రామానికి ఏమైంది?

ఆ గ్రామానికి ఏమైంది?