
గంజాయితో నలుగురు అరెస్టు
టెక్కలి రూరల్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని, వారి వద్ద నుంచి 4.75 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అక్రమంగా గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు టెక్కలి సీఐ తన సిబ్బందితో కలిసి జాతీయ రహదారిపై ఉన్న బీహార్ దాబా సమీపంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సౌత్ 24 పరగణాల జిల్లా గొసాబా, పశ్చిమ ఆరంపూర్ గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు గోపాల్ సర్ధార్, సుమన్ దాస్, మహాదేబ్ నాయక్, సుమన్ మండల్‌ల వాహనాలను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా గంజాయి పట్టుబడడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు బెంగళూర్ తీసుకొని వెళ్లి అక్కడ విక్రయాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయిని ఒడిశా రాష్ట్రంలోని జాజ్‌పూర్‌లో కొనుగోలు చేసినట్లు తెలిపారు.
10.26 కిలోలతో మరో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు 10.26 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎకై ్సజ్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. రైల్వేస్టేషన్ సమీపంలో బధవారం తనిఖీలు జరుపుతుండగా దీపక్ కుమార్ నాయిక్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అతని వద్ద గంజాయి ఉండడంతో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒడిశాలోని బరంపురం నుంచి ఇచ్ఛాపురం వచ్చి ట్రైన్‌లో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా గంజాయి స్వాధీనం చేసుకొని నిందుతుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

గంజాయితో నలుగురు అరెస్టు