
ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ
మెళియాపుట్టి: ఆశ్రమ పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాలని సీతంపేట ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు స్పష్టం చేశారు. మండలంలోని పెద్దలక్ష్మీపురం గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలు బాగు చేయాలన్నారు. వసతి గృహంలో తాగునీటి పథకం, వసతి గదులు, మరుగుదొడ్లు, స్టోర్, వంటశాల ఇతరత్రా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం మోనూ ప్రకారం ఉందా లేదా అని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొంతమంది విద్యార్థులతో మాట్లాడి ఏవైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు చిన్నపాటి సమస్యలు వచ్చినా పీహెచ్‌సీకి తీసుకెళ్లి పరీక్షలు చేయించి బాధ్యతగా వ్యవహరించాలని హెచ్‌ఎం మురళీకి సూచించారు. పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.