
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా రెండో రోజు బుధవారం కూడా దాడులు నిర్వహించారు. పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన శిరడా, దిద్దినూగూడ, కొత్తగూడ పరిసరాల్లో 1,400 లీటర్ల నాటుసారా, 6,300 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే భారీగా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. సారా తయారీ, విక్రయాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్లు మురళీ, రామచంద్ర కుమార్, ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు తదితరులు పాల్గొన్నారు.