
మాజీ సైనికుల రక్తదాన శిబిరం రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం కల్చరల్: దేశానికి సేవ చేయడంతో పాటు సమాజ సేవలో సైతం ముందుంటామని నిరూపిస్తున్నారు మాజీ సైనికులు. జిల్లా మాజీ సైనిక సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివాస్‌ను పురస్కరించుకుని జూలై 25వ తేదీన మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రి సౌజన్యంతో జిల్లా సైనిక సంక్షేమశాఖ కార్యాలయం పెద్దరెల్లివీధి వద్ద శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అలాగే జూలై 26వ తేదీన జిల్లా మాజీ సైనిక సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో కార్యేషు ఈవెంట్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని వెంకోజీపాలెంలోని చందన మోహనరావు ఫంక్షన్ హాల్‌లో మా క్షేమం.. మీ త్యాగం.. మా ధైర్యం అనే నినాదంతో శ్రావణ సఖి 4వ ఎడిషన్ నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా వీర మాత లు, వీర నారీమణులకు ఘనంగా సత్కార్యం చేసి, చెరో రూ.10 వేల చొప్పున ఆర్థిక లబ్ధి అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94394 56757 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.