
డబుల్ రోడ్డు పనులు పునఃప్రారంభం
వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస నియోజకవర్గంలో బెండి గేటు నుంచి బెండి మీదుగా నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు నుంచి అక్కుపల్లి మీదగా కాశీబుగ్గ వరకు అధ్వానంగా మారిన రోడ్లు దుస్థితిపై ‘ఎన్నాళ్లీ రహదారిద్య్రం?’ అనే శీర్షికతో ఈ నెల 19న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు అభివృద్ధి పనులు పునఃప్రారంభించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నువ్వలరేవు–రేగిలపాడు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.23 కోట్లు, వజ్రపుకొత్తూరు అక్కుపల్లి మీదుగా కాశీబుగ్గ వరకు సుమారు రూ.21 కోట్లు వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు సిద్ధం చేస్తామని చెప్పి ఏడాది కాలం దాటిన తర్వాత పనులు మళ్లీ ప్రారంభించడం కొసమెరుపు.

డబుల్ రోడ్డు పనులు పునఃప్రారంభం