
మిథున్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం
ఇచ్ఛాపురం రూరల్: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం తెరతీసిందన్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే మిథున్ రెడ్డిపై లిక్కర్ స్కామ్ తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం పాలసీ అమలైందని గుర్తు చేశారు. అక్రమ అరెస్టులకు వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదన్నారు.
ఎమ్మెల్సీ నర్తు రామారావు