సాయం చేసేందుకు వెళ్తే ప్రాణమే పోయింది | - | Sakshi
Sakshi News home page

సాయం చేసేందుకు వెళ్తే ప్రాణమే పోయింది

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

నార్పల: సాయం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యు వాత పడిన ఘటన మండల పరిధిలోని నాయనపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం తెల్లవారుజామున పుట్లూరు మండలంలోని కొండాపురంలో రేణప్పకు చెందిన ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. అనంతపురం వైపు తీసుకెళ్లాడు. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఈ విషయం గుర్తించిన రేణప్ప వెంటనే ఆ మార్గంలోని వెంకటాంపల్లికి చెందిన తన బంధువు బాలరాజుకి ఫోన్‌ చేసి దొంగను అడ్డుకోవాలని సూచించాడు. అప్రమత్తమైన బాలరాజు (45) వెంటనే తన కుమారుడు ప్రవీణ్‌తో కలిసి నాయనపల్లికి చేరుకుని మెయిన్‌ రోడ్డుపై ట్రాక్టర్‌ను ఆపేందుకు యత్నించాడు. అయితే, ట్రాక్టర్‌ దొంగ ఆపకుండా ఢీకొనడంతో తీవ్ర గాయాలైన బాలరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దొంగిలించిన వ్యక్తి ట్రాక్టర్‌ను వదిలి పారిపోయాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement