కారులో మంటలు | - | Sakshi
Sakshi News home page

కారులో మంటలు

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

పుట్టపర్తి టౌన్‌: పుట్టపర్తి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద కారులో మంటలు చెలరేగాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వైద్యం కోసం సోమవారం కారులో ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రి వద్ద నిలిపిన కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు.

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

మదనపల్లె టౌన్‌: అతిగా మద్యం తాగి ఓ వ మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం మదనపల్లెలో వెలుగుచూసింది. కదిరిలోని పిల్ల వంక కాలనీకి చెందిన నారాయణ అదే ప్రాంతంలో బార్బర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. మృతుని భార్య భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజులుగా షాపునకు వెళ్లకుండా ఇంట్లోనే అతిగా మద్యం తాగుతూ ఉన్నాడు. ఆదివారం రాత్రి నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని చికిత్స కోసం స్విమ్స్‌కు తరలిస్తుండగా, మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

టీబీ డ్యాంకు జీరో ఇన్‌ఫ్లో

రాయదుర్గంటౌన్‌: తుంగభద్ర జలాశయానికి ఎగువ భాగంలో నుంచి ఇన్‌ఫ్లో ఆదివారం ఉదయం జీరో స్థాయికి పడిపోయింది. ఎల్‌–నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతువపనాలు ప్రవేశించి రోజులు గడుస్తున్నా ఎగువ భాగంలోని శృంగేరి, వరనాడు, అగుంబే, శివమొగ్గ, చిక్‌మంగళూరు తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో టీబీ డ్యాంకు వరద రావడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement