పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన ఎస్పీ సతీష్‌కుమార్ వివిధ సమస్యలపై 80 వినతులు స్వీకరించారు. స్వయంగా వికలాంగుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు విన్న అనంతరం సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య తీవ్రతను తెలుసుకుని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, డీటీఆర్‌బీ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, సీఐ బొజ్జప్ప, ఎీస్బీ సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సతీష్‌కుమార్
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 80 వినతులు


