ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించాలి | - | Sakshi
Sakshi News home page

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించాలి

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

ధర్మవరం అర్బన్‌: ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీఓ హోంలో ఏపీటీఎఫ్‌ జోనల్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు బోధనానుభవం ఉన్న ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ గుదిబండగా మారిందన్నారు. దీంతో పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందన్నారు. టెట్‌ మినహాయింపు వచ్చేలోపు ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించి అర్హత మార్కులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ బీకే ముత్యాలప్ప, ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు సానే రవీంద్రరెడ్డి, బలరాముడు, శ్రీనివాసులు మాట్లాడారు. సమావేశంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ వాసుకుమార్‌, నాయకులు శంకరనారాయణ, జగదీష్‌, దుర్గాప్రసాద్‌, రామకృష్ణ, చంద్రశేఖర్‌, బాలకదిరప్ప, బాలయ్య, నాగప్ప, శివయ్య, శ్రీనివాసులు, రవికుమార్‌, తిప్పన్న, చెన్నుడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement