కనగానపల్లి: మొహర్రం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ అంకిత సురాన సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని తూంచర్ల, భానుకోట గ్రామాల్లో పర్యటించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. మొహర్రం వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే వేడుకలు నిర్వహించుకోవాలని, అందరూ సోదర భావంతో మెలగాలన్నారు. ఆమె వెంట రామగిరి సీఐ మహమ్మద్ అలీ ఉన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
పుట్టపర్తి అర్బన్: సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ అంకిత సురాన అన్నారు. శుక్రవారం కొత్తచెరువులోని సత్యసాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘ఆపరేషన్ దండయాన్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎస్పీ మాట్లాడుతూ... విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నివారణ, మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన ఉండాలన్నారు. బ్యాంకు వివరాలు, ఓటీపీలు వ్యక్తిగత సమాచారం ఇతరులకు ఇవ్వకూడదన్నారు. ఎక్కడైనా వేధింపులకు గురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యోతిర్లత, సీఐ రాజశేఖర్, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.


