బత్తలపల్లి: మొహర్రం ఉత్సవాలకు బత్తలపల్లి సిద్ధమైంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కాశీంస్వామిని గురువారం అర్ధరాత్రి కొలువుదీరారు. శుక్రవారం ముజావర్లు టైలర్ రియాజ్, మాబాషా, నూరుల్లా, ఖాశీంవలి కాశీంస్వామి చావిడిలో ఫాతెహ చేశారు. అనంతరం నిత్యపూజ నివేదన నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని గంటాపురం, వేల్పుమడుగు, ముష్టూరు, మాల్యవంతం, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, సంజీవపురం, అనంతసాగరం తదితర గ్రామాల్లోనూ మొహర్రం వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొహర్రం వేడుకలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ సోమశేఖర్ సూచించారు.


