విద్యార్థుల ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆకలి కేకలు

Jun 19 2026 12:12 AM | Updated on Jun 19 2026 12:12 AM

గుడిబండ: పేదరికం కారణంగా చిన్నారులు విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం లేదని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. గుడిబండ మండల వ్యాప్తంగా 70 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఫళారం గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌లో 44 మంది విద్యార్థులున్నారు. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ సమస్యల కారణంగా అమలు చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న నిత్యావసరాలు, వంట గ్యాస్‌ ధరలతో ప్రభుత్వ నిర్దేశిత బడ్జెట్‌తో నాణ్యమైన భోజనం అందించలేక పోతున్నామని ఏజెన్సీ నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటిౖకైనా అధికారులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పట్టించుకోని ఉన్నతాధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement